HomeUncategorizedవినాయక చవితి పండుగ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు మేయర్ క్యాంప్ కార్యాలయం లో... వినాయక చవితి పండుగ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు మేయర్ క్యాంప్ కార్యాలయం లో కుటుంబ సమేతం గా భక్తి శ్రద్ధలతో గణేష్ పండుగ జరుపుకొన్నారు. By SAMAYAM DAILY September 7 , 24 12:48pm 0 41 Related Share FacebookTwitterPinterestWhatsAppPrintTelegramCopy URLKoo Previous articleభారీ వర్షాలతో జరిగిన నష్టం పూర్తి వివరాలు అందజేయాలి. *భారీ వర్షాల తో జరిగిన నష్టం పూర్తి వివరాలు అందజేయాలి.*ప్రతి మండలంలో ముగ్గురు అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలి. *పంట నష్టం జరిగిన ప్రతి రైతుకు ఆర్థిక సాయం అందేలా చూడాలి.*రక్షిత మంచినీటిని ప్రతి రోజు క్లోరినేషన్ చేయాలి. -జిల్లా అధికారులతో కలెక్టర్ క్రాంతి వల్లూరు టెలి కాన్ఫరెన్స్.* గత ఎనిమిది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు కారణంగా జిల్లాలో జరిగిన నష్టం వివరాలను పూర్తిస్థాయిలో నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లాలోని పంచాయతీ రాజ్ నీటిపారుదల, శాఖ వ్యవసాయ శాఖ, మునిసిపల్ ,విద్యాశాఖ, ట్రాన్స్కో ,డి ఆర్ డి ఏ ,రోడ్లు భవనాలు, రెవెన్యూ శాఖ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఆగస్టు నెల చివరి వరకు కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రతి రైతు వివరాలు, ఇండ్లు కూలిపోయిన బాధితుల వివరాలు, వర్షాల కారణంగా కూలిపోయిన నష్టం సంబంధించిన ప్రభుత్వ ఆస్తుల వివరాలు అందించాలని, ఇది వరకే జిల్లా అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు . నిర్ణీత ప్రొఫార్మాలలో వర్షాల కారణంగా జరిగిన నష్టం వివరాలను, ఫోటోలతో పాటు వెంటనే అధికారులకు అందజేయాలని సూచించారు. ఇందుకోసం ప్రతి మండలానికి ముగ్గురు అధికారులతో కమిటీలను ఏర్పాటు చేయాలని ఆర్డీవోలను కలెక్టర్ ఆదేశించారు.ఈ కమిటీలు ఆయా మండలాలకు సంబంధించిన తాసిల్దారులు ఎంపీలు పంచాయతీరాజ్ హౌసింగ్ అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంట నష్టం జరిగిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా అధికారులు రిపోర్టులను సమర్పించాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాలో వర్షాలు వరదల కారణంగా పంట నష్టం జరిగిన రైతు వివరాలను, ప్రభుత్వం ఇచ్చిన ఫార్మేట్లో సమర్పించాలన్నారు . పంట నష్టం జరిగిన రైతులు నష్టపోకుండా అధికారులు చూడాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు వర్షాలు వర్గాల కారణంగా చెడిపోయిన కరెంటు పోల్స్ ట్రాన్స్ఫార్మర్ల వివరాలు అందించాలన్నారు. వర్షాలకు నష్టం వాటిల్లిన పిహెచ్సి సెంటర్లు,అర్బన్ హెల్త్ సెంటర్లో సమగ్ర నివేదిక సమర్పించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు జిల్లాలోని రక్షిత మంచినీటి ట్యాంక్ ల వద్ద ప్రతిరోజు తాగునీటిని క్లోరినేషన్ చేసే ల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్లోరినేషన్ చేసిన నీటిని ప్రజలు తాగేలా అవగాహన కల్పించడంతోపాటు చల్లార్చిన నీటిని తాగేలా చూడాలన్నారు. రక్షిత మంచినీటి పైప్లైన్ లీకేజీలు వెంటనే మరమ్మతులు చేసి తాగునీరు కలుషితం కాకుండా చూడాలి అన్నారు. వర్షాలు వరదల కారణంగా జరిగిన నష్టం వివరాలను పూర్తిస్థాయిలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు అందించాల్సి ఉన్నందున జిల్లా అధికారులు త్వరగా పూర్తిస్థాయి నష్టం వివరాలను సమగ్రంగా నిర్ణీత ప్రొఫార్మాలలో,ఫోటోలతో పాటు సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.Next articleపారిస్ ఓలంపిక్ లో పథకం సాధించిన దీప్తి జీవంజి కి కోటి రూపాయలు నగదు నజరానా, గ్రూపు 2 ఉద్యోగమ్ ఇవ్వాలని టీజీ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం, అధికారులకు ఆదేశాలు RELATED ARTICLES Uncategorized ఆదిలాబాద్ అంటే కాంగ్రెస్ కు అంత చిన్నచూపెందుకు? -ఫిరోజ్ ఖాన్, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, March 11, 2025 Uncategorized రాష్ట్రం లో సాగునీరు అందక కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్న దుర్భర పరిస్థితుల నేపధ్యంలో మంగళవారం తెలంగాణ భవన్ లో బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ గారిని కలిసిన బోర్ల రామిరెడి March 11, 2025 Uncategorized కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జికి లైన్ క్లియర్?* March 9, 2025 LEAVE A REPLY Cancel reply Comment: Please enter your comment! Name:* Please enter your name here Email:* You have entered an incorrect email address! Please enter your email address here Website: Save my name, email, and website in this browser for the next time I comment. - Advertisment - Most Popular ఆదిలాబాద్ అంటే కాంగ్రెస్ కు అంత చిన్నచూపెందుకు? -ఫిరోజ్ ఖాన్, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, March 11, 2025 రాష్ట్రం లో సాగునీరు అందక కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్న దుర్భర పరిస్థితుల నేపధ్యంలో మంగళవారం తెలంగాణ భవన్ లో బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ గారిని కలిసిన బోర్ల రామిరెడి March 11, 2025 కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జికి లైన్ క్లియర్?* March 9, 2025 ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు. జారి పై అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా March 7, 2025 Load more Recent Comments Help on Hello world! Natividad Blenner on Hello world!