Wednesday, December 11, 2024
HomeUncategorized*వినాయక చవితి శుభాకాంక్షలు: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి**హైదరాబాద్, సెప్టెంబర్ 06:*  (సమయం న్యూస్) వినాయక చవితి...


*వినాయక చవితి శుభాకాంక్షలు: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి*


*హైదరాబాద్, సెప్టెంబర్ 06:*  (సమయం న్యూస్) వినాయక చవితి పండుగ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను ప్రతిష్టించుకొని భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని మేయర్  కోరారు. విఘ్నేశ్వరుని కృపతో విఘ్నాలన్ని తొలగి, అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ప్రజలు గణేష్ ఉత్సవాలు ఆనందోత్సాహాలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మేయర్ సూచించారు.

—————————————————————————–

Previous article
*ప్రజావాణి వాయిదా*
హైదరాబాద్ సెప్టెంబర్ 06:- సమయం న్యూస్

తెలంగాణ ప్రభుత్వం ప్రజల అర్జీలను స్వీకరించేందుకు, ప్రతీ మంగళవారం మరియు శుక్రవారం మహాత్మ జ్యోతిబా ఫూలే ప్రజాభవన్, బేగంపేట, హైదరాబాద్ నందు రాష్ట్ర స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

16వ కేంద్ర ఆర్థిక సంఘంతో మహాత్మ జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో నిర్వహించబడే ముఖ్యమైన సమావేశాల కారణంగా, తేది 10.09.2024 మంగళవారం రోజున నిర్వహించబడే ప్రజావాణి కార్యక్రమం, తేది  11.09.2024 బుధవారానికి వాయిదా వేయబడింది.

ఈ సందర్భంగా, అర్జీదారులందరు ఈ మార్పును గమనించి, తేది 10.09.2024 మంగళవారంకు బదులుగా  తేది11.09.2024 బుధవారం నాడు ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని విజ్ఞప్తి చేయడమైనది.
Next article
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే బొజ్జ విస్తృత పర్యటన :

వాగుదాటి గ్రామస్తుల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే :


కోతకు గురైన రోడ్ల, పంట పొలాల పరిశీలన :

మెరుగైన విద్యాను అందించాలి :

డిఈతో మాట్లాడి తాత్కాలిక రోడ్లు వేయాలని ఆదేశం :

అదిలాబాద్ సెప్టెంబర్06- (సమయం న్యూస్):  ఇంద్రవెల్లి మండలం లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కోతకు గురైన రోడ్లను ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ శుక్రవారం పరిశీలించారు.ఇంద్రవెల్లి మండలంలోని ఆంజి గ్రామంలో పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చట్టించి బోర్డుపై ప్రశ్న ఇచ్చి సమాధానం రాబట్టు కున్నారు.పాఠశాలలోని వంటగదిని పరిశీలించారు.విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. పాఠశాల అభివృద్ధి పనుల కోసం 15 లక్షలు మంజూరు చేశారు.అనంతరం వడగావ్ గ్రామంలో పర్యటించారు.జెండా గూడా గ్రామస్తులు ఎమ్మెల్యేను కలసి బ్రిడ్జి నిర్మాణం చేయాలనీ కోరగా..డిఈతో ఎమ్మెల్యే ఫోన్ లో మాట్లాడి బ్రిడ్జి నిర్మాణానికి అయ్యే ఖర్చుల నివేదికలు తమకు ఇవ్వాలని ఆదేశించారు.గ్రామస్తులతో కలసి వాగు దాటి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.లాల్-టెక్డి సమీపంలోని కోతకు గురైన రోడ్డును పరిశీలించారు.జిల్లా కలెక్టర్ రాజర్షిషా తో ఫోన్ లో మాట్లాడి వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించాలని కోరారు.రాకపోకల కోసం తాత్కాలిక రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించారు.పంట పొలంలోకి వెళ్లి రైతుతో మాట్లాడి పంట నష్టంపై అరా తిశారు.అనంతరం పాఠశాలను సందర్శించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.ప్రకృతి వైపరీత్యాల కారణంగా భారీ నష్టం వాటిల్లిందని,రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు.వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ తో మాట్లాడి రైతులకు పంట నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.రైతు రుణమాఫీ విషయంలో రైతులేవరు ఆందోళనకు గురి కావొద్దని, ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments