ఉద్యోగరీత్యా సుదీర్ఘకాలం శాఖపరమైన సేవలను అందించి విశ్రాంత జీవితం గడుపుతున్న విశ్రాంత ఉద్యోగులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవడం అభినందనీయమని సమాచార పౌర సంబంధాల శాఖ పూర్వపు సంచాలకులు బి రాజమౌళి అన్నారు.
ఆదివారం రోజున హనుమకొండ వడ్డేపల్లి జంక్షన్ సమీపంలో గల శ్రీమాత బంకేట్ హాలులో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన వలన విశ్రాంత ఉద్యోగులలో ఆత్మీయ అనుబంధం తో పాటు ఆత్మ స్థైర్యం పెంపొందుతుందని శాఖా పరంగా జిల్లా స్థాయిలో ఇలాంటి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం తెలంగాణ రాష్ట్రంలో ప్రధమమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వినూత్న ధోరణిలో కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం అందరిలో ఒక నూతన ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తుంది అన్నారు. ఇలాంటి దృక్పథం ఇతర జిల్లాలకు కూడా మార్గదర్శకం అవుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న విశ్రాంత అధికారులు సిబ్బంది తమ అనుభవాలను అభిప్రాయాలను పాలుపంచుకున్నారు. కార్యక్రమంలో విశ్రాంత అధికారులు పాకాల భాస్కర్, ముర్తుజా, వెంకటనారాయణ, మల్లయ్య, ఇమ్మానియేల్, లక్ష్మీనారాయణ, ప్రభాకర్, సారయ్య, విధుమౌళి, సుధాకర్, దేవేందర్ రెడ్డి, సుదర్శన్ -వయోవృద్ధులు కట్టయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం అందరూ ఆహ్లాదకర వాతావరణంలో సామూహిక భోజనం చేశారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విశ్రాంత ఉద్యోగులకు విశ్రాంతి అధికారి పాకాల భాస్కర్ కృతజ్ఞతలు తెలియజేశారు.