Sunday, December 8, 2024
HomeUncategorized*వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు* *బి సి సంక్షేమ,రవాణా శాఖ మంత్రి...

*వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు*
*బి సి సంక్షేమ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్*

*పాలకుర్తి చాకలి ఐలమ్మ స్మారక భవనానికి స్థల పరిశీలన చేయాలని అధికారులకు ఆదేశాలు*

*చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు,వర్ధంతి కార్యక్రమం కోసం కోసం 15 లక్షలు విడుదల చేసిన బీసీ సంక్షేమ శాఖ*

హైదరాబాద్ , సెప్టెంబర్ 6: (సమయం న్యూస్)ఈనెల 26 వ తేదిన  తెలంగాణ ఉద్యమకారిణి, వీరవనిత తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్యశాలి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా ఘనంగా నిర్వహించడానికి  ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.  2022 నుండి తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రజా పాలన లో కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. సమీక్షా సమావేశంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ,రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన రజక నేతలు పాల్గొన్నారు.

చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు, వర్ధంతి కార్యక్రమం కోసం బీసీ సంక్షేమ శాఖ 15 లక్షల రూపాయలు కేటాయించింది. అందులో ఈనెల 26 న రవీంద్ర భారతిలో జరిగే జయంతి కార్యక్రమాల కోసం 12 లక్షల రూపాయలు కేటాయించగా, 10 వ తేది జరిగే వర్ధంతి కార్యక్రమం కోసం 3 లక్షలు కేటాయించారు.

ఉత్సవాల కోసం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చైర్మన్ గా 40 మందితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. పాలకుర్తి లో చాకలి ఐలమ్మ స్మారక భవన నిర్మాణానికి  ఉన్న అనువైన స్థలాలను అధికారులతో పరిశీలించాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కి సూచించారు. ఇప్పటికే ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహ రోడ్డు పనుల నేపథ్యంలో తొలగించిన గద్దె నిర్మాణం ఇతర ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు..


ఈ నెల 26 వ తేదీన ప్రభుత్వం తరుపున రవీంద్ర భారతిలో అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు జరుపుకోవడంతో పాటు భూమి కోసం, భుక్తి కోసం,విముక్తి కోసం ఆమె త్యాగం గ్రామగ్రామాన తెలిసేలా అన్ని గ్రామాల్లో ఉత్సవాలు జరపాలని కమిటీ సభ్యులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

Previous article
Next article
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ


హైదరాబాద్ సెప్టెంబర్06 ( సమయం న్యూస్) కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియామకం అయ్యారు.  ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. 1966లో నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం రహమత్ నగర్ లో మహేష్ కుమార్ జన్మించారు. కాంగ్రెస్ విద్యార్థి రాజకీయాల్లో చేరిన మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తరవాత 1994 అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్ పల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  వేర్ హౌజ్ కార్పొరేషన్ చైర్మన్ గా పని చేసిన ఆయన తర్వాత కాలంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్, అధికార ప్రతినిధిగా పని చేయడంతో పాటు 2021 కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. కాంగ్రెస్ ప్రత్యేక ఆహ్వానితుల కమిటీతో పాటు , ఇతర కీలక పార్టీ భాద్యతల్లో పని చేసిన మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం ఎమ్మెల్సీ గా ఉన్నారు.
      రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి మార్పు అనివార్యమయింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఒక్కరే ఉండకూడదనే పార్టీ లైన్ ప్రకారం రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడి కుర్చీ వదులుకోక తప్పలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలో ఆయనతో పాటు అదే సామాజిక వర్గానికి చెందిన మధు యాస్కీ గౌడ్, బల రామ్ నాయక్, సంపత్ కుమార్, బలమూరి వెంకట్ ఉన్నారు. అయితే వ్యహాత్మకంగా కాంగ్రెస్ అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ ను ఎంపిక చేసింది. రాష్ట్ర సీఎం రెడ్డి సామాజిక వర్గం కాగా, ఉప ముఖ్యమంత్రి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. ఇక రాష్ట్ర జనాభాలో 53 శాతం ఉన్న బీసీలకు ప్రాతినిధ్యం ఉండేలా రాష్ట్ర అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ కు అవకాశం కల్పించింది. గతంలో 2004లో వై యస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నపుడు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన డి. శ్రీనివాస్ ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లు ముఖ్యమంత్రి లుగా పని చేసిన రోజుల్లో వరుసగా బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య పార్టీ అధ్యక్షులుగా పని చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అవకాశం వచ్చినా.. సామజిక వర్గాల బ్యాలన్సింగ్ తో పదవులను భర్తీ చేస్తున్న సాంప్రదాయాన్ని ఈ సారి కూడా కొనసాగించినట్టు కనిపిస్తోంది.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments