Monday, January 20, 2025
HomeUncategorizedవ్యవసాయ యోగ్యత గల భూమి కి రైతు భరోసా  పంపిణీ స్పష్టం చేసిన సి ఏం...

వ్యవసాయ యోగ్యత గల భూమి కి రైతు భరోసా  పంపిణీ స్పష్టం చేసిన సి ఏం రేవంత్ రెడ్డి .

*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ వివరాలు.

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కొత్త సంవత్సరంలో మంచి జరగాలని, వ్యవసాయాన్ని పండగ చేయాలని రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకున్నాం

వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ఎలాంటి షరతులు లేకుండా ప్రతీ ఎకరానికి రైతు భరోసా అందించాలని  నిర్ణయం తీసుకున్నాం.

ప్రస్తుతమున్న రూ.10వేల రైతు భరోసాను రూ.12వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం.

భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నాం

ఈ పథకానికి “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా” నామకరణం చేస్తున్నాం.

రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం.

జనవరి 26, 2025 నుంచి ఈ పథకాలు ప్రారంభమవుతాయి.

రాజ్యాంగం అమలు జరిగి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ పథకాలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం.

వ్యవసాయ యోగ్యం కాని భూములకు (మైనింగ్, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రహదారులు, నివాస, పారిశ్రామిక, వాణిజ్యఅవసరాలకు ఉపయోగించే భూములు, నాలా కన్వర్టెడ్ భూములు, వివిధ ప్రాజెక్టులకు ప్రభుత్వం సేకరించిన భూములకు) రైతు భరోసా వర్తించదు.

ప్రభుత్వ ఆదాయం పెంచడం, ప్రజలకు పంచడమే మా ప్రభుత్వం విధానం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments