*శానిటేషన్ పై దృష్టి సారించండి*
*జి హెచ్ ఎం సి కమిషనర్ ఆమ్రపాలి కాట*
*హైదరాబాద్ సెప్టెంబర్ 18*:- (సమయం న్యూస్)గణేశ నిమజ్జనం పూర్తయిన నేపథ్యంలో శానిటేషన్ పై దృష్టి సారించాలని జి హెచ్ ఎం సి కమిషనర్ ఆమ్రపాలి కాట అధికారులను ఆదేశించారు.
నగరంలో కొన్ని ప్రదేశాలలో బుధవారం కూడా గణేష్ విగ్రహాల నిమజ్జనం చేయడం జరిగిందని బుధ వారం సాయత్రం వరకు నిమజ్జన పాక్రియ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నందున జోనల్ కమిషనర్లు శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గురువారం మిలాద్ ఇన్ నభి పండుగ ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా గర్బెజ్ లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎక్కడ నుండి కూడా శానిటేషన్ పై పిర్యాదు రావద్దని కమిషనర్ అధికారులకు ఆదేశించారు.
రోడ్డు పై కలర్ పేపర్ షార్ట్స్ లేకుండా వెంటనే తొల్గించాలని కోరారు
100 మీటర్ల కు ఒక శానిటేషన్ వర్కర్ టీమ్ గా ఏర్పరిచి ఎప్పటికప్పుడు గర్బేజ్ తొలగించాలని అధికారులను ఆదేశించారు రోడ్డు పై సేకరించిన గార్బేజ్ ను తొందరగా డంపు యార్డు కు తరలించేందుకు అవసరమైన వాహనాలను కూడా సిద్ధం చేసుకోవాలని సూచించారు.అవసరమైన ప్రదేశాలలో స్వీలింగ్ మిషన్ లను వినిటిగించుకొన్ని రోడ్ల పై చెత్త లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జోనల్ కమిషనర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి శానిటేషన్ ను పర్యవేక్షించాలని కమిషనర్ ఆమ్రపాలి. కాట. కోరారు.