ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కేరిని భాగస్వామ్యం చేయాలి.
సంగారెడ్డి సెప్టెంబర్16:-( సమయం న్యూస్)
సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ రెండు వరకు అన్ని గ్రామాల్లో స్వచ్ఛత హీ సేవా2024 కార్యక్రమాలు .
*ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములుగా చేయాలి.
–
ఈనెల 17 నుండి వచ్చే నెల రెండు తారీఖు వరకు జిల్లాలోని అన్ని గ్రామాలలో *స్వచ్ఛత హీ సేవ* 2024 కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. ఈ సందర్భంగా 15 రోజులపాటు అన్ని గ్రామాలల్లో ఈ కార్యక్రమాలలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి, వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
స్వచ్ఛతకి భాగీ దారి కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత ప్రతిజ్ఞ, మానవహారాల ఏర్పాటు, గ్రామసభ నిర్వహణ,తల్లి పేరుతో ప్రతి ఒక్కరూ , ఒక మొక్క నాటడం, విద్యార్థులకు స్వచ్ఛత కార్యక్రమాలపై వివిధ రకాల పోటీ పరీక్షలు నిర్వహించడం, ఇంటింటికి తిరిగి స్వచ్ఛత కార్యక్రమాలపై అవగాహన కల్పించడం, స్వచ్ఛతరన్ యువజన సంఘాల సమావేశాలు, క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వచ్ఛత హీ సేవ సంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా, సంగీతం పోటీలు, పాటల పోటీలు, డ్రాయింగ్ వాల్ పెయింటింగ్ పోటీలు, సంప్రదాయ నృత్య ప్రదర్శన పోటీలు, వ్యాసరచన, చేతివృత్తుల ప్రదర్శన, సంప్రదాయ ఆటల పోటీలు, వ్యవసాయ అనుబంధ రంగాల వారిని ఈ కార్యక్రమాలలో భాగస్వామ్యం చేసేలా పోటీల నిర్వహణ లాంటి కార్యక్రమాలు, 15 రోజులపాటు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. ఈ కార్యక్రమాల విజయవంతం కోసం అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీఓ లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ ప్రత్యేక అధికారులు, గ్రామీణ అభివృద్ధి శాఖ సిబ్బంది, ఎస్ హెచ్ జి మహిళా సంఘాల సభ్యులు,ఉపాధి హామీ సిబ్బంది కృషి చేయాలన్నారు. ప్రజలందరి భాగస్వామ్యంతో *స్వచ్ఛతా హి సేవ 2024* కార్యక్రమాలు విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో కోరారు