


*హెచ్-సిటీ పనులకు స్థల పరిశీలన చేసిన కమిషనర్ ఇలంబర్తి*
*హైదరాబాద్, ఫిబ్రవరి16:*( సమయం న్యూస్) శేరిలింగంపల్లి జోన్ లో పలు అభివృద్ధి పనులకు ఆదివారం జిహెచ్ఎంసి కమిషనర్ ఇలంబర్తి స్థల పరిశీలన చేశారు. ఇంటర్ డిపార్ట్మెంట్ కన్వర్జెన్సీ పర్యటనలో భాగంగా హెచ్ఎండిఎ, వాటర్ వర్క్స్, టియస్ఐఐసి పోలిస్, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పరిశీలన చేసారు. వారితో పాటుగా జోనల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్, ప్రాజెక్టు మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అధికారులతో పలు ప్రాంతాల్లో ప్రతిపాదించిన పనుల స్థల పరిశీలన చేసారు.
హెచ్-సిటి ద్వారా ప్రతిపాదించిన ఫ్లై ఓవర్లు,రోడ్డు విస్తరణతో పాటుగా జంక్షన్ ఇంప్రూవ్మెంట్ పనుల ప్రతిపాదన పనులను ఈ సందర్భంగా పరిశీలించారు.
జంక్షన్ వద్ద హెచ్-సిటి ప్రతిపాదన పనుల వద్ద యుటిలిటీ తొలగింపుతో పాటు స్థల సేకరణకు చర్యలు తొందరగా తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సంబంధిత విభాగాల అధికారులతో కలిసి కమిషనర్ బస్సులో ప్రయాణించి
ప్రతిపాదిత పనుల వద్ద ఆయా శాఖలకు సంభందించిన యుటిలిటీ విద్యుత్, వాటర్ వర్క్స్, టెలిఫోన్ వైర్లు వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను కోరారు.
హెచ్-సిటి పనుల టెండర్ ప్రక్రియ తుది దశలో ఉన్న నేపథ్యంలో పనులను కొనసాగించేందుకు యూటిలిటీలు తొలగింపు చర్యలు ముమ్మరంగా తీసుకోవాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆయా హెచ్ ఓడి లను కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం హెచ్-సిటి పనులను ప్రతిష్టాత్మకంగా అమలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా శాఖలు సమన్వయంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కమిషనర్ అన్నారు.
ఈ సందర్భంగా హెచ్-సిటి ద్వారా ప్రతిపాదించిన పనులైన ఖాజాగూడ జంక్షన్,
సీపీ ఆఫీస్ గచ్చిబౌలి జంక్షన్, త్రిపుల్ ఐటీ జంక్షన్, విప్రో జంక్షన్, కాంటిన్జెంట్ జంక్షన్, డిఎల్ఎఫ్ రోడ్డు మజీద్ బండ (బొటానికల్ గార్డెన్), చందానగర్ రైల్వే స్టేషన్, లింగంపల్లి ఫ్లైఓవర్, శ్రీదేవి టాకీస్ గంగారం రోడ్డు, ఆల్విన్ ఎక్స్ రోడ్
తదితర ప్రతిపాదించిన పనుల స్థల పరిశీలన చేసిన జిహెచ్ఎంసి పనులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఎండిఎ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, రాష్ర్ట పురపాలక శాఖ డిప్యూటీ సెక్రటరీ ప్రియాంక, వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డి, జాయింట్ సి పీ డెవిస్ చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి, టియస్ పి డి సి ఎల్ అధికారులు శేఖర్, పాండ్యన్, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్, వేణు గోపాల్ రెడ్డి, టి యస్ ఐ ఐ సి ఎం డి విష్ణువర్ధన్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్, జోనల్ సి పి, ఏ సి పి, ప్రాజెక్టు ఈ ఈ లు, డిప్యూటీ ఈ ఈ లు తదితరులు పాల్గొన్నారు.