కూడా ఛైర్మెన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి.
*అభివృద్ది పనుల్లో వేగం పెంచండి: కుడా ఛైర్మెన్ ఇనుగాల వెంకట్రామి రెడ్డి*
▪️వైస్ చైర్మన్ తో కలిసి క్షేత్ర స్థాయి లో పరిశీలన…
వరంగల్ సెప్టెంబర్20-(సమయం న్యూస్)
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) కు చెందిన అభివృద్ది పనుల్లో వేగం పెంచాలని కుడా ఛైర్మెన్ ఇనుగాల వెంకట్రామి రెడ్డి అన్నారు.
శుక్రవారం వైస్ ఛైర్మెన్/ బల్దియా కమీషనర్ డా.అశ్విని తానాజీ వాకడే తో కలిసి క్షేత్ర స్థాయి లో పర్యటించి పరిశీలించారు.
ఈ సందర్భం గా ఛైర్మెన్ వైస్ చైర్మన్ లు ఆగ్గలయ్య గుట్ట ప్రాంతంలో జైన గుట్ట ఆలయ ప్రాంతాన్ని పరిశీలించి ఆలయ ఆవరణ పరిశుభ్రం గా ఉండేలా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. సరిగమప పార్క్ తో పాటు పద్మాక్షి ఆలయ ప్రాంతంలో గల అప్రోచ్ రోడ్డు పరిశీలించారు.ఈ సందర్భం గా వైస్ ఛైర్మెన్ మాట్లాడుతూ బతుకమ్మ పండగ దృష్ట్యా బతుకమ్మ లను నిమజ్జనం చేయనున్న తరుణం లో కొలనులో పేరుకు పోయిన గుర్రపు డెక్క ను యుద్ధ ప్రాతిపాదికన తొలగించాలని అధికారుల్ని ఆదేశించారు. హంటర్ రోడ్ లోని డి కన్వెన్షన్ ప్రక్కన గల కుడా కు చెందిన ఖాళీ స్థలాన్ని పరిశీలించారు భద్రకాళి బండ్ పై నూతనం గా నిర్మిస్తున్న ఎంట్రెన్స్ లైటింగ్ ఏర్పాటు పనులను డి జోన్ లో కొనసాగుతున్న పనులను పరిశీలించి వేగవంతం గా పూర్తి చేయాలన్నారు.కాకతీయ మ్యూజికల్ గార్డెన్ (కే ఎం జీ) ను సందర్శించిన క్రమం లో గార్డెన్ ఆవరణ పరిశుభ్రం గా ఉండేలా చూడాలని ఫౌంటెన్ ఏర్పాటు తో పాటు గ్రీనరీ పెంపొందించి ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని అన్నారు.భద్రకాళి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాడ వీధుల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇట్టి కార్యక్రమం లో సి పి ఓ అజిత్ రెడ్డి ఈ ఈ భీమ్ రావు భద్రకాళి ఆలయ ఈ ఓ శేషు భారతి కుడా ఏ ఈ సిద్ధార్థ నాయక్ భద్రకాళి ప్రధాన అర్చకులు శేషు తదితరులు పాల్గొన్నారు.