Thursday, December 26, 2024
HomeUncategorized*అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ.. మూడు రోజుల పర్యటనలో భాగంగా

*అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ.. మూడు రోజుల పర్యటనలో భాగంగా

మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా చేరుకున్నారు. ఈరోజు (శనివారం) న్యూయార్క్‌లోని క్వాడ్‌ సమ్మిట్‌లో ప్రధాని పాల్గొననున్నారు. మోదీ పర్యటనను ఎన్నారైలు ఓ పండుగలా భావిస్తున్నారు. హిస్టారికల్‌ ఈవెంట్స్‌ను గుర్తు చేసుకుంటూ మోదీకి ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల మోడ్‌లో ఉన్న అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన ఆసక్తికరంగా మారింది.

శనివారం అమెరికా ప్రెసిడెంట్‌ జో బైడెన్‌తో కలిసి డెలావర్‌లో నిర్వహించే నాల్గవ క్వాడ్‌ సమ్మిట్‌లో పాల్గొంటారు ప్రధాని మోదీ. ఇండో-పసిఫిక్ దేశాల అభివృద్ధి, పరస్పర సహకారం పై సమీక్ష సహా వచ్చే ఏడాది క్వాడ్‌ సమ్మిట్‌ అజెండాపై ప్రధానంగా చర్చిస్తారు. నాల్గో క్వాడ్‌ సమ్మిట్‌ నిజానికి భారత్‌లో జరగాల్సి ఉంది కానీ అమెరికా విజ్ఞప్తి మేరకు ఐదో క్వాడ్‌ సమ్మిట్‌కు వచ్చే ఏడాది భారత్‌ వేదిక కాబోతోంది.

ప్రధాని మోదీ అమెరికా పర్యటనతో ఎన్నారైల ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది. 22న న్యూయార్క్‌లో ఎన్నారైలతో సమావేశమవుతారాయన. నసావు వెటరన్స్ మెమోరియల్ కొలీజియంలో ఇప్పటికే అద్భుత ఏర్పాట్లను చేశారు. ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికేందకు ఎన్నారైలు భారీ సన్నాహాలు చేస్తున్నారు. తమ మన్‌ కీ బాత్‌ షేర్‌ చేసుకునేందుకు దాదాపు 24 వేల మంది ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు.

ఇక 23వ తేదీన న్యూయార్క్‌ వేదికగా ఐక్య రాజ్య సమతి ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మిట్‌ ఆఫ్‌ ఫ్యూచర్‌లో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. హ్యాట్రిక్‌ విక్టరీతో ఇంట రికార్డు క్రియేట్‌ చేసిన మోదీ..అంతకన్నా ముందే అమెరికాలోనూ తన మార్క్‌ చాటుకున్నారు. అందుకు ఎన్నారైలా ఆవాజే నిదర్శనం. 1997లో అమెరికాలో పర్యటించిన సమయంలో ఆయన బ్యాగ్‌ను ఎవరో కొట్టేశారు. పాస్‌ పోర్ట్‌, మనీ అందులోనే ఉండిపోయాయి. అయినా ఆయన ఏమాత్రం కలత చెందలేదు. చాలా నిబ్బరంగా వున్నారని ఆనాటిని ఘటనను గుర్తు చేసుకున్నారు ఎన్నారై హిరుభాయ్‌ పటేల్‌.

ఇక యంగ్‌ పార్లమెంటీరియన్‌గా అమెరికా ఆహ్వానం మేరకు అప్పట్లో న్యూజెర్సీలో పర్యటించారు మోదీ. ఆయన ప్రసంగం మరో వివేకానందుడిని తలపించిందన్నారు ఎన్నారై లు జ్యోతింద్ర మెహతా, హష్‌ముఖ్‌ పటేల్‌. ఆలోచనలో స్పష్టత.. భావప్రకటన అబ్బురపరిచాయన్నారు. ఇలా ఎన్నారైలే కాదు ఇప్పుడు అగ్రదేశం అగ్రనేతల మన్‌ కీ దృష్టి మన మోదీజీనే. క్వాడ్‌ సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ దైపాక్షిక సంబంధంలో కీలకం కాబోతుంది. ఇక మోదీతో భేటీ అవుతానంటూ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.*

Previous article
Next article
ఉప్పల్ భాగాయత్ లో రేపు ( 22 న ) విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం హైదరాబాద్, సెప్టెంబర్ 21 : శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని ఉప్పల్ భగాయత్ లోని విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవన ప్రాంగణంలో ఆదివారం, 22 వ తేదీన, నిర్వహిస్తున్నట్టు విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కమిటీ తెలిపింది. 22 న ఉదయం 7 గంటలకు గణపతి పూజ, అఖండ ప్రతిష్ట, కలశ స్థాపనతో ఈ యజ్ఞం ప్రారంబమవుతుందని తెలిపారు. అనంతరం ధ్వజారోహణం, విశ్వకర్మ భగవానుడికి అభిషేకం, పల్లకి సేవ ఉంటుంది. ఈ సందర్బంగా విశ్వకర్మ కళాకారులచే రూపొందిన హస్తకళా ప్రదర్శన ఉంటుందని, సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని మహోత్సవ కమిటీ తెలిపింది. ఈ యజ్ఞానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనా చారి, కేంద్ర బీసీ కమీషన్ మాజీ సభ్యులు ఆచారి, రాష్ట్ర బీసీ కమీషన్ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, దాసోజు శ్రవణ్, ఉపేంద్ర చారి, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణఆత్మగౌరవ భవనం చైర్మన్ లాలుకోట వెంకటా చారి, ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి సుందర్ తదితర ప్రముఖులందరూ పాల్గొంటారని విశ్వ కర్మ యజ్ఞ మహోత్సవ కమిటీ తెలియచేసింది. ఈ కార్యక్రమానికి విశ్వబ్రాహ్మణ సమాజం పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కమిటీ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments