*ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడే దుగ్గొండి పోలీసులు*
దుగ్గొండి గ్రామం శివారు లో నల్లబెల్లి రోడ్ వెైపు లో గల పెద్ద చెరువు దగ్గర ఒక వ్యక్తి పురుగుల మందు త్రాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోబోతున్నాడని దుగ్గొండి పోలీస్ స్టేషన్ కు 100 కాల్ రాగా పోలీస్ స్టేషన్లో అందుబాటులో ఉన్న సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కానిస్టేబుల్ రాకేష్ ఇద్దరు హుటాహుటిన దుగ్గొండి గ్రామ శివారు చెరువు వద్దకు వెళ్లి పురుగుల మందు తాగుతున్న వ్యక్తి తేజావత్ ప్రకాష్ తండ్రి బద్రు 30 సంవత్సరాలు లంబాడ గుండ్లపాడు,బట్టు తండా,నల్లవెల్లి మండలానికి చెందిన వ్యక్తిని తన చేతిలో ఉన్న పురుగుల మందు డబ్బాను పోలీసులు లాక్కొని కాపాడిన అనంతరం తాను పురుగుల మందు ఏమైనా తాగి ఉంటాడని అనుమానంతో వెంటనే దుగ్గొండి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి ప్రథమ చికిత్స చేయించి 108 లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి పంపించడం జరిగినది. ఆత్మహత్య చేసుకోబోయే వ్యక్తి ప్రాణాపాయంలో బయటపడినాడు. క్షేమంగా ఉన్నాడు కుటుంబ కలహాల వల్ల భార్యతో గొడవపడి వారి తండా నుండి దుగ్గొండి గ్రామ శివారుకు వచ్చి గడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకో బోయాడు. అని తేజవాత్ . ప్రకాష్ కు వారి బంధువులను తల్లిదండ్రులని భార్యని పిలిపించి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కానిస్టేబుల్ రాకేష్ లు, ప్రకాష్ కు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగినది.