Friday, November 22, 2024
HomeUncategorized*ఆత్మహత్యలు వద్దు.. కలిసి పోరాటం చేద్దాం..**రాష్ట్ర రైతులకు మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు**సెప్టెంబర్ 06:-...

*ఆత్మహత్యలు వద్దు.. కలిసి పోరాటం చేద్దాం..*

*రాష్ట్ర రైతులకు మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు*

*సెప్టెంబర్ 06:- (సమయం న్యూస్) రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్న రైతు మృతదేహాన్ని గాంధీలో సందర్శించిన హరీష్ రావు*
రుణమాఫీ కాలేదన్న కారణంతో మేడ్చల్ కు చెందిన రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.
పంట పండించే రైతన్న ప్రాణంకోల్పోయి గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఉండటం మనస్సును కలిచివేసింది. 
రైతన్నలారా.. రుణమాఫీ కాలేదనే కారణంతో దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. ధైర్యాన్ని కోల్పోకండి.
బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ప్రతి రైతుకు రుణమాఫీ చేసే దాకా ప్రభుత్వాన్ని వదలిపెట్టం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర రైతాంగం పక్షాన రాజీలేని పోరాటం చేస్తం.
ముఖ్యమంత్రి గారూ.. మీ తప్పుడు ప్రకటనలు, బుకాయింపులతో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నరు. రుణమాఫీ కాదేమోనని ఆత్మహత్యలు చేసుకుంటున్నరు.
దయచేసి బాధ్యతగా వ్యవహరించండి. మేనిఫెస్టోలో చెప్పినట్లు రైతులందరికి రుణమాపీ అమలు చెయ్యండి. రుణమాఫీ అమలు విషయంలో మీరు నిర్దేశించుకున్న డెడ్ లైన్ ముగిసి నెలకావొస్తున్నది.  ఇప్పటికైనా కళ్లు తెరిచి మాట నిలుపుకోండి

Previous article
*విద్యుత్ శాఖ సిబ్బంది  పనికి లంచం అడిగితే నా కార్యాలయానికి తెలియజేయండి* – సీఎండీ శ్రీ ముషారఫ్ ఫరూఖి.

సెప్టెంబర్ 06- సమయం న్యూస్
సీఎండీ కార్యాలయంలో అవినీతి  ఫిర్యాదులు స్వీకరించుటకు ప్రత్యేక ఏర్పాట్లు  చేసినట్లు  ముషారఫ్ అన్నారు.

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ పరిధిలో మా సిబ్బంది/అధికారులు ఏదైనా పనికి లంచం అడిగితే 040 – 2345 4884 కు గాని లేదా 768 090 1912 కు కాల్ చేసి ఫిర్యాదుచేయగలరని సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముషారఫ్ ఫరూఖి, ఐ.ఏ.ఎస్ తమ విద్యుత్ వినియోగదారులకు తెలిపారు.

సంస్థ తమ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి గాను, పలు   అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నది. కొంత మంది సిబ్బంది, అధికారులు అవినీతికి పాల్పడుతూ సంస్థ కు చెడ్డపేరు తెస్తున్నారు. ఈ నేపధ్యం లో వినియోగదారుల సమస్యలు/ఫిర్యాదులు నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సీఎండీ తెలిపారు. 

ఇప్పటికే నూతన సర్వీసుల మంజూరు, క్యాటగిరీ మార్పు, టైటిల్ ట్రాన్స్ ఫర్, బిల్లింగ్ లోపాలు వంటి ఇతర సేవలు పొందేందుకు సంస్థ వెబ్సైట్ మరియు మొబైల్ యాప్ ల ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించబడింది.

సంస్థ పరిధిలో అవినీతి రహిత వాతావరణ కల్పించడానికి, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి సంస్థ కట్టుబడి వున్నది. వినియోగదారులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడం మరియు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని  సీఎండీ శ్రీ ముషారఫ్ ఫరూఖి పేర్కొన్నారు.
Next article
*మంత్రులు రాజ నరసింహ పొన్నం ప్రభాకర్ కలిసి ల్యాబ్ టెక్నీషియన్ లకు నియామక పత్రాలు అందజేత,
కాలేజీ హాస్టల్ కు శంకుస్థాపన*

సెప్టెంబర్06:- (సమయం న్యూస్ )
రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ గార్లు హైదరాబాదులోని కోటి మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో  నూతనంగా 121 కోట్ల రూపాయలతో నిర్మించనున్న కాలేజీ హాస్టల్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం ప్రజా వైద్యారోగ్య శాఖలో 282 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు.

ప్రైవేట్ హాస్పిటళ్లకు పోటీగా ప్రభుత్వ హాస్పిటళ్లు ను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారు.ప్రభుత్వం అంటే మనం.. మానవత్వ దృక్పథం, సేవా దృక్పథం ఉండాలి. డాక్టర్ వృత్తి సర్వీస్ ఓరియెంటెడ్ ప్రొఫేషన్.. గా ఉండాలన్నారు.
వైద్య సిబ్బంది ఓపికగా, ప్రేమగా పని చేయాలన్నారు.మీరందరూ అలాగే కమిట్‌మెంట్‌తో పనిచేస్తారని ఆశిస్తున్నాం.
ఉస్మానియా మెడికల్ కాలేజ్ అంటే ఒక బ్రాండ్…
దేశంలో ఎక్కడికైనా వెళ్ళినా ఉస్మానియా అంటే హైద్రాబాద్… హైద్రాబాద్ అంటే ఉస్మానియా అంటారు..గత 30 ఏళ్లుగా పెండింగ్ సమస్యలు ఉన్నాయి… మా సమస్యలపై సమ్మెకు పోవడానికి ఇష్టం లేకపోయినా కూడా అనేకసార్లు నోటీసులు ఇస్తూ… ఎట్టకేలకు సాధించుకున్న జుడా లకు ముందు అభినందనలు…

కొన్నేళ్లుగా స్టై పెండ్ నెలలు ఇవ్వలేదు… కానీ నెరవేరలేదు.. కానీ మేము చేసాము..

వైద్యులను దేవుళ్ళను నమ్మినట్టు నమ్ముతాము…

ఎంతో నిష్ణాతులైనా డాక్టర్లు మన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉంటారు…

మేము వ్యవస్థ నీ పటిష్టం చేసేందుకే బదిలీలు చేసాము..

ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం.. కోసం ఇప్పటికే నిధులను మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కింది..

32 ఎకరాలలో అత్యాధునిక సౌకర్యాలతో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం చేపడుతోందన్నారు
పదేళ్లు గత ప్రభుత్వం చేయలేనివి మేము ఇప్పుడు చేసి చూపుతున్నం

కోర్టు లో కేసు ఉన్నా కూడా మేము కొత్త ప్లేస్ లో నిర్మాణం కోసం తీసుకున్న నిర్ణయం అందరూ అప్రిసియేట్ చేస్తున్నారు..

ప్రభుత్వాలు… ఉంటాయి… పోతాయి… కానీ ప్రజలకు ఏమి చేసాము అనేది ముఖ్యం..

మరొక నెల రెండు నెలల్లో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేసుకోబోతున్నామన్నారు.

అనంతరం,

కొత్తగా రిక్రూటైన ల్యాబ్ టెక్నీషియన్లకు అపాయింట్‌మెంట్ లెటర్లను మంత్రులు దామోదర రాజ నర్సింహా, పొన్నం ప్రభాకర్ గార్లు అందజేశారు.

చాలా కాలంగా ఎదురు చూస్తున్న 285 మంది ల్యాబ్ టెక్నీషియన్ నియామక పత్రాలు అందుకుంటున్న మీ అందరికీ శుభాకాంక్షలు..

మీ జీవితాల్లో ఇది పర్వదినం.

282 మంది తమ జీవితంలో స్థిరపడబోతున్నారు.

ఇప్పటికే 1284 మందిని నియమించడానికి  నోటిఫికేషన్ వేశారు .

వారు కూడా త్వరలోనే నియామక పత్రాలు అందుకుంటారు వారికి అభినందనలు..

మీకు ప్రధాన బాధ్యత ఉంటుంది..

డాక్టర్ ఏవిధంగా చికిత్స చేస్తారో మీరు ఇచ్చే నివేదిక ఆధారంగానే ఉంటుంది.

హాస్పటల్ మంచిగా నడవాలంటే మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి..

ప్రభుత్వం తరపున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం..

రాబోయే కాలంలో బాధ్యతలు నిర్వహించి మీరంతా వృత్తి ధర్మంతో సక్రమంగా నిర్వహించాలన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.
ఇంకో 1300 పోస్టులను మరో ఏడాదిలో రిక్రూట్ చేస్తాం.
రోగ నిర్దారణ చేసే బాధ్యత ల్యాబ్ టెక్నీషియన్లదే, దానిపైనే డాక్టర్లు ఆధారపడుతారనీ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్, ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరు  వెంకట్, రాష్ట్ర వైద్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్ వి కర్ణన్, రాష్ట్ర మెడికల్  ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్ ఎండి హేమంత్ కుమార్, డైరెక్టర్ మెడికల్ ఎడ్యు కేషన్ డాక్టర్ వాణి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీందర్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు , ఉస్మానియా మెడికల్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments