![](https://i0.wp.com/samayamdaily.net/wp-content/uploads/2025/02/img-20250205-wa05916906386585424748989.jpg?resize=696%2C474&ssl=1)
ఢిల్లీ లోని పలు ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షణ.. ఈ నెల 8న ఓట్లలెక్కింపు, ఫలితాలు.. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ నేతల మధ్య పోటాపోటీ.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసు యంత్రాంగం పటిష్ఠమైన చర్యలు.. సాయంత్రం 6.30 తర్వాత *ఈసారి ఆప్ ఆధిపత్యానికి బిజెపి గండి..?*
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలవ బోతున్నారనే అంశంపై ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడ్డాయి.. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో అత్యధిక సీట్లు గెలువబోతున్న పార్టీ, ఇతర పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ఎగ్జిట్ పోల్ తన అంచనాలను ప్రకటించింది..
ఇందులో ఈసారి కేంద్రంలో బీజేపీ ఢిల్లీలో ఆప్ ఆధిపత్యానికి గండి కొట్ట బోతున్నట్లు తెలిపింది. ఎగ్జిట్ పోల్ ప్రకారం 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ఈసారి ఏకంగా 35 నుంచి 40 సీట్లు దక్కించు కోబోతున్నట్లు తెలిపింది.
అలాగే, అధికార ఆప్ కు 32 నుంచి 37 సీట్లు లభించ బోతున్నట్లు వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి 0 నుంచి 1 సీటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో, గత మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఊపు మీదున్న ఆప్ ఆధిపత్యానికి గండి పడటం ఖాయమని ఎగ్జిట్ పోల్ తేల్చేసింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఆప్, బీజేపీ మధ్య గట్టి పోరు సాగింది.. ఇరు పార్టీలు విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కేజ్రివాల్ నేతృత్వం లోని ఆప్ వరుసగా నాలుగో సారి డిల్లీలో అధికారం దక్కించుకునేందుకు శ్రమించారు.
అయితే, కేంద్రంలో మూడో సారి గెలిచినా ఢిల్లీని గెలవలేక పోతున్నారన్న అపప్రదను పోగొట్టు కునేందుకు బీజేపీ నేతలు పక్కా వ్యూహాలు రచించారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ అంచనాలు కాషాయ దళంలో ఊపు తెచ్చాయి..
*డిల్లీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ విడుదల..*
*పీపుల్స్ పల్స్:*
బీజేపీ 51-60,
ఆప్ 10-19.
*ఏబీపీ మ్యాట్రిజ్:*
బీజేపీ 35-40, ఆప్ 32-37,
*ఆత్మ సాక్షి:*
బీజేపీ 38-41, ఆప్ 27-30, కాంగ్రెస్ 1-3,
*చాణిక్య స్ట్రాటజీస్:*
బీజేపీ 39-44, ఆప్ 25-28,
*కేకే సర్వే:*
బీజేపీ 22, ఆప్ 39,
*ఢిల్లీ టౌమ్స్ నౌ:*
బీజేపీ 39-45, ఆప్ 22-31..
*బీజేపీ కి జై కొట్టిన ఢిల్లీ ప్రజలు..*
*27 సంవత్సరాల తరువాత ఎక్జిట్ పోల్స్ మొత్తం బీజేపీ దే గెలుపు అంటున్నారు.. వేచి చూద్దాం..