*ఇకపై టోల్ ఛార్జీలకు ఏడాది, లైఫ్‌టైమ్ పాస్‌లు వచ్చేస్తున్నాయ్..*
నేషనల్ హైవేలపై తరచూ ప్రయాణం చేసే ప్రైవేట్ కారు యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. వీరి కోసం ఏడాదికి రూ.3000, 15 ఏళ్లకు రూ.30000తో పాసులు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలి. వీటితో దేశంలోని ఏ జాతీయ రహదారిపైనైనా ఎన్నిసార్లెనా తిరగొచ్చు. ప్రస్తుతం నెలకు రూ.340 పాసుతో ఒక టోల్ ప్లాజాలోనే వెళ్లాలనే రూల్ ఉంది. కొత్త విధానం ప్రకారం నెలకు రూ.250 చెల్లిస్తే చాలు.ఇప్పటికే ప్రతి కారులో ఫాస్ట్‌ట్యాగ్‌లను ఇచ్చినందు వలన కొత్తగా పాస్‌లు జారీ చేయాల్సిన అవసరం లేకుండా వీటిమీదే పాస్‌లను ఇచ్చే అవకాశం ఉంది.