Saturday, December 28, 2024
HomeUncategorizedఇక సెలవు.. దేశ మాజీ ప్రధాని మన్మోహనుడి శకం..

ఇక సెలవు.. దేశ మాజీ ప్రధాని మన్మోహనుడి శకం..

*ఇక సెలవు.. దేశ మాజీ ప్రధాని మన్మోహనుడి శకం..*

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (92) అస్తమయం.. ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుగా, ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం ఛైర్మన్‌గా, ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రధాని సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిటీ చైర్మన్‌ వంటి బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్‌ సింగ్‌..

కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న మన్మోహన్‌ సింగ్‌.. ఇంట్లో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయిన మన్మోహన్‌.. రాత్రి 8:06 గంటలకు ఎయిమ్స్‌ లోని మెడికల్ ఎమర్జెన్సీకి తరలింపు.. రాత్రి 9:51 గంటలకు మన్మోహన్‌ కన్ను మూసినట్టు ఎయిమ్స్ ప్రకటన..

1932 సెప్టెంబర్‌ 26న అవిభక్త భారత్‌ లోని పంజాబ్‌ రాష్ట్రంలో జన్మించిన మన్మోహన్‌ సింగ్‌.. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా సేవలు అందించిన మన్మోహన్‌.. దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన ప్రధానుల్లో మన్మోహన్‌ ఒకరు.. 1991 నుంచి 1996 వరకు పీవీ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా సేవలు.. ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్‌కు పేరు.. 1991 అక్టోబర్‌లో తొలిసారిగా రాజ్య సభలో అడుగు.. ఐదు సార్లు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన మన్మోహన్‌ సింగ్‌..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments