సెల్లార్ కూలి ముగ్గురు కార్మికులు మృతి ,ఒకరికి గాయాలు
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అపార్ట్మెంట్ నిర్మాణానికి చేపట్టిన సెల్లార్ గోడ కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు.
ఎల్బీనగర్ లోని సితార హోటల్ వెనుక ప్రాంతంలో సెల్లార్ తవ్వకాలు చేపడుతున్నారు. ఖమ్మం జిల్లాకి చెందిన కూలీలు పనులు చేస్తుండగా సెల్లార్ గోడ కూలింది.
భారీస్థాయిలో మట్టి పెళ్ళలు మీద పడడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన కార్మికుడిని స్థానిక ఆసుపత్రికి తరలించిన పోలీసులు.
మృతులంతా ఖమ్మం జిల్లా కుంజర్ల మండలం మల్లుపల్లి గ్రామనికి చెందిన వారు.
మృతి చెందిన వారు వీరయ్య, రాము, వాసు. వీళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు.
ఆసుపత్రి లో చికిత్స పొందుతన్న భిక్షపతి
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి కి తరలింపు