Friday, November 22, 2024
HomeUncategorized*కలెక్టర్ ను కలిసిన బోధన్, బాన్సువాడ సబ్ కలెక్టర్లు* నిజామాబాద్, సెప్టెంబర్ 05 : బోధన్,...

*కలెక్టర్ ను కలిసిన బోధన్, బాన్సువాడ సబ్ కలెక్టర్లు*

నిజామాబాద్, సెప్టెంబర్ 05 : బోధన్, బాన్సువాడ సబ్ కలెక్టర్లుగా నియామకమైన ఐ.ఏ.ఎస్ అధికారులు వికాస్ మహతో, కిరణ్మయి కొప్పిశెట్టి గురువారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ను ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకేలు అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కలెక్టర్ వారికి అభినందనలు తెలియజేశారు.

Previous article
సెప్టెంబర్05:-

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలంలో ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆదివాసీ మహిళ ను గాంధీ ఆసుపత్రిలో పరామర్శించిన సీతక్క

ఆదివాసీ మహిళ కు జరుగుతున్న శస్త్ర చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్న సీతక్క

ఎస్టి సంక్షేమ శాఖ తరఫున లక్ష రూపాయల పరిహారాన్ని కుటుంబ సభ్యులకు అందజేసిన సీతక్క

*ఘటన విషయంలో కొందరు చేస్తున్న విమర్శలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క*

దాడి ఘటనను పక్కదారి పట్టించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు – సీతక్క

తక్షణ పరిహారంగా లక్ష రూపాయలు ఇస్తే.. దాన్ని కూడా తప్పు పడతారా?

ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని తెలవగానే ప్రభుత్వం వెంటనే స్పందించింది

దోషులకు కఠినంగా శిక్ష పడేలా చేయడం మా బాధ్యత

*మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా, ఆడబిడ్డగా, ఆదివాసి బిడ్డగా నాకు ఇంకా ఎక్కువ బాధ్యత వుంది*

అందుకే బాధితురాలికి అన్ని రకాలుగా అండగా వుంటున్నాం

ఎవరు అనుమానాలు పడాల్సిన అవసరం లేదు

నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తాం

ఇప్పటికే నిందితుని అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశాము

చట్ట పరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపట్టాము

ఘటనకు మతం రంగు పూసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు

మత కొట్లాటలు లేపేందుకు కొందరు కుట్రలు పన్ను తున్నారు

వారి పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలి
Next article
నయింనగర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయండి: బల్దియా కమీషనర్ డా.అశ్విని తానాజీ వాకడే*
▪️  05 సెప్టెంబర్ 2024* :

నయింనగర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని బల్దియా కమీషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అన్నారు.

నయీంనగర్ లో నిర్మిస్తున్న బ్రిడ్జి తుది దశ పనులను కమీషనర్ గురువారం కేత్ర స్థాయి లో పరిశీలించి  వేగవంతం గా పూర్తి చేయుటకు తగు సూచనలు చేశారు.

   ఈ సందర్భం గా కమీషనర్ మాట్లాడుతూ ఈ నెల 9 వ తేది రాష్ట్ర ముఖ్యమంత్రి  బ్రిడ్జి ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నందున  పెండింగ్ లో ఉన్న అసంపూర్తి    పనులతో పాటు సుందరికరణ  పనులను   శుక్రవారం నాటికి పూర్తి చేయాలని కమీషనర్అధికారులను ఆదేశించారు.

     ఈ కార్యక్రమం లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ చాడ స్వాతి, ఎస్ ఈ రాజయ్య హెచ్ ఓ రమేష్, ఏ ఈ సరిత తదితరులు పాల్గొన్నారు
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments