
*కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జికి లైన్ క్లియర్?*
హైదరాబాద్ మార్చి 09
దేశంలోనే తొలిసారి రెండు అంతస్తుల కేబుల్ వంతెన రాష్ట్రంలో నిర్మాణం కాబో తుంది కృష్ణ నదిపై సోమ శిల వద్ద ప్రతిపాదించిన భారీ బ్రిడ్జికి కేంద్ర రవాణా హైవేల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోద ముద్ర వేసింది,
శుక్రవారం ఢిల్లీలో ఈ కమిటీ బేటి అయింది మరో రెండు మూడు నెలల్లో జాతీయ రహదారుల విభాగం కేబుల్ వంతెనకు టెండర్లకు పిలువనుంది. మూడేళ్లు క్రితమే ఈ కేబుల్ బ్రిడ్జిని చేపట్టాల్సి ఉండగా కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ ప్రాజెక్టు రద్ద యింది. ఇటీవల దాన్ని నేషనల్ హైవేస్ ఒరిజినల్ NHO,జాబితాలోకి మార్చ డంతో ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది.
800 మీటర్లు నిడివి కలిగి ఉండే ఈ బ్రిడ్జి నిర్మాణంకు రూ.1,062 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.రెండు వరుసల కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం ద్వారా కృష్ణా నది ఇవతల తెలంగాణలోని మల్లేశ్వరం నుంచి అవతల ఏపీలోని సంగమేశ్వరం పుణ్యక్షేత్రాలను కలుపుతూ తెలంగాణ – ఏపీ మధ్య మరోమార్గం ఏర్పడనుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం పనులను త్వరలోనే ప్రారంభించేందు కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మార్గం ద్వారా తెలం గాణ నుంచి తిరుపతి మధ్య దూరం తగ్గనుంది. తెలంగాణ నుండి ప్రస్తుతం నంద్యాల, తిరుపతికి వెళ్లాలంటే కర్నూలు మీదు గా చుట్టూ తిరిగి వెళ్లక తప్పని పరిస్థితి. అదే కొల్లాపూర్ మీదుగా కృష్ణా నదిని దాటేలా కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే.. తెలంగాణ నుంచి తిరు పతికి దాదాపు 90 కిలో మీటర్లు దూరం తగ్గుతుంది.
కృష్ణా నదిపై సోమశిల వద్ద ప్రతిపాదిత రెండు వరుసల కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి దేశంలోనే ఇప్పటి వరకు లేని తరహాలో కొత్త డిజైన్ తో రూపుదిద్దుకోనుంది. దేశంలో రెండు వరుసల వంతెనలు అరుదు…
అందులోనూ కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జితో పర్యాట కులు అక్కడ ప్రకృతి అందాలను వీక్షించేందుకు గాజుతో కూడిన నడకదారి డిజైన్ తో అనుసంధానిం చడం ఇప్పటి వరకు ఎక్క డా లేదు. తొలిసారి సోమ శివల వద్ద రూపు దిద్దుకోనుంది.