*కేంద్ర బడ్జెట్.. ఈ నాలుగు వర్గాలకు ప్రాధాన్యం: నిర్మలా సీతారామన్..*
ఢిల్లీ: పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర బడ్జెట్ (2025-26) ను ప్రవేశ పెడుతున్నారు.. ఈ సందర్భంగా నిర్మలమ్మ మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ లో గరీబ్, యూత్, అన్నదాత, నారీ వర్గాలకు ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. తాము చేపట్టిన సంస్కరణలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశ మయ్యాయని అన్నారు. అధిక వృద్ధి సాధిస్తున్న దేశంగా భారత్ నిలిచిందని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు..
: టీడీఎస్, టీసీఎస్‌లో సీనియర్ సిటిజన్లకు ఊరట..*
వృద్ధులకు టీడీఎస్ నుంచి ఊరట నిస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.. మధ్య తరగతిని దృష్టిలో ఉంచుకుని కొత్త పన్ను విధానం ఉంటుందని స్పష్టం చేశారు. సీనియర్ సిటిజన్లకు టీడీఎస్, టీసీఎస్ పరిమితి రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచారు. అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై 2.4 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు..
: రూ. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు..*
వేతన జీవులకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు.. రూ. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపునిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కొత్త పన్ను విధానంలో వర్తింప చేయనున్నట్లు తెలిపారు. స్టాండర్డ్ డిడక్షన్‌తో కలుపుకొంటే రూ. 12.75 లక్షల వరకు పన్ను సున్నా ఉండనున్నట్లు తెలిపారు..
మహిళలకు రూ. 2 కోట్ల వరకూ రుణాలు..*
షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన మహిళలకు కేంద్రం శుభవార్త చెప్పింది.. వీరి కోసం టర్మ్ లోన్ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తొలిసారి సొంతంగా వ్యాపారం ప్రారంభించే వారు, ఉన్న వాటిని విస్తరించాలనుకునే మహిళలకు ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో రూ. 2 కోట్ల వరకూ రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా 5 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నా*
భీమా రంగం లోFDI 100 శాతానికి పెంపు..*
బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) పరిధిని ప్రస్తుతమున్న 74 శాతం నుంచి 100 శాతానికి పెంచనున్నట్లు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.. FDI విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనల్ని సమీక్షించి మరింత సులభతరం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, మొత్తం ప్రీమియాన్ని భారత్ లోనే ఇన్వెస్ట్ చేసే బీమాదారులకు ఇది వర్తించనుంది..
తగ్గనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు..*
ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గనున్నటు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.. లిథియం బ్యాటరీ లపై ట్యాక్స్ తగ్గిస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. దీంతో, EV ధరలు తగ్గనున్నాయి. విద్యుత్ సంస్కరణలకు కీలకంగా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం కావాలని తెలిపారు. వర్ధమాన ద్వితీయ శ్రేణి నగరాల్లో జీసీసీల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని మంత్రి వెల్లడించారు..
ద్రవ్య లోటు 4.8 శాతం: నిర్మల..*
ద్రవ్య లోటు జీడీపీలో 4.8 శాతంగా ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంచనా వేశారు. ‘2024-25 ఆర్థిక సంవత్సరానికి సవరించిన వ్యయం రూ. 47.16 లక్షల కోట్లు.. మూల ధన వ్యయం రూ. 10.1 లక్షల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన ఆదాయ అంచనా రూ. 31.47 లక్షల కోట్లు (అప్పులు మినహా). నికర పన్నుల ద్వారా సమకూరిన ఆదాయం రూ. 25.57 లక్షల కోట్లు’ అని నిర్మల తెలిపారు..
*చిన్న స్థాయి అణు రియాక్టర్ల కోసం జాతీయ అణుశక్తి మిషన్..*
చిన్న స్థాయి అణు రియాక్టర్ల కోసం జాతీయ అణుశక్తి మిషన్‌ను ప్రారంభిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రూ. 20 వేల కోట్లతో న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ పరిశోధనా విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 2047 కల్లా కనీసం 100 గిగావాట్ల అణు విద్యుత్‌ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రైవేట్ రంగంలో క్రియాశీలక భాగస్వామ్యం కోసం అణుశక్తి చట్టానికి, అణుశక్తి పౌర బాధ్యత చట్టానికి సవరణలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు..: కిసాన్ క్రెడిట్ కార్డ్ 7.7 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు, పాడి రైతులకు స్వల్పకాలిక రుణాలను సులభతరం చేస్తుంది.. KCC ద్వారా తీసుకున్న రుణాలకు సవరించిన వడ్డీ రాయితీ పథకం కింద రుణ పరిమితిని రూ. 3 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచుతారు. అస్సాం లోని నమ్రప్‌లో వార్షిక సామర్థ్యం 12.7 లక్షల మెట్రో టన్నుల ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు..
*- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..* పత్తి ఉత్పాదకత పెంచేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక మిషన్.
పత్తి రైతులకు మేలు చేసేలా దీర్ఘకాలిక లక్ష్యాలతో జాతీయ పత్తి మిషన్..
– ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..
: *కేంద్ర బడ్జెట్ 2025:*
ఉడాన్ స్కీం ద్వారా రీజినల్ కనెక్టివిటీ పెంచడం కోసం రానున్న పదేళ్లలో 120 విమానాశ్రయాల ఏర్పాటు..
బీహార్‌లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు ఏర్పాటు..
మహిళలకు రూ. 2 కోట్ల వరకూ రుణాలు..*
షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన మహిళలకు కేంద్రం శుభవార్త చెప్పింది.. వీరి కోసం టర్మ్ లోన్ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తొలిసారి సొంతంగా వ్యాపారం ప్రారంభించే వారు, ఉన్న వాటిని విస్తరించాలనుకునే మహిళలకు ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో రూ. 2 కోట్ల వరకూ రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా 5 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు
*చిన్న స్థాయి అణు రియాక్టర్ల కోసం జాతీయ అణుశక్తి మిషన్..*
చిన్న స్థాయి అణు రియాక్టర్ల కోసం జాతీయ అణుశక్తి మిషన్‌ను ప్రారంభిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రూ. 20 వేల కోట్లతో న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ పరిశోధనా విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 2047 కల్లా కనీసం 100 గిగావాట్ల అణు విద్యుత్‌ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రైవేట్ రంగంలో క్రియాశీలక భాగస్వామ్యం కోసం అణుశక్తి చట్టానికి, అణుశక్తి పౌర బాధ్యత చట్టానికి సవరణలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు
: గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా..*
గిగ్ వర్కర్లకు కేంద్రం తీపికబురు చెప్పింది. గిగ్ వర్కర్ల గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. వారికి గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ-శ్రమ్ పోర్టల్ కింద వీరి వివరాలు నమోదు చేస్తున్నట్లు వివరించారు. ఈ నిర్ణయంతో కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.. *రూ. లక్ష కోట్ల పట్టణ ఛాలెంజ్ ఫండ్: నిర్మలా సీతారామన్..*
పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక విషయాలు వెల్లడించారు. రూ. లక్ష కోట్ల పట్టణ ఛాలెంజ్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నిధి ద్వారా పట్టణ ప్రాంతాల అభివృద్ధితో పాటు ఆపత్కాల పరిస్థితుల్లో పట్టణ ప్రజల బాగోగులను చూసుకునేందుకు వినియోగిస్తామన్నారు. ఈ నిధి ద్వారా పట్టణ జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు..*కేంద్ర బడ్జెట్.. అంగన్వాడీ లకు గుడ్ న్యూస్..*
అంగన్వాడీ లకు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. పోషణ 2.0లో భాగంగా అంగన్వాడీల్లో అధునాాతన సౌకర్యాలు కల్పించి.. మరింత నాణ్యమైన ఆహారాన్ని చిన్నారులు, బాలింతలకు అందజేయ నున్నట్టు తెలిపారు. అలాగే దేశంలో మెడికల్ టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయనున్నామని, ఇందు కోసం బడ్జెట్‌లో రూ. 20 వేల కోట్లు కేటాయించినట్టు వివరించారు..
*వచ్చే ఐదేళ్లలో 75 వేల కొత్త మెడికల్ సీట్లు..*
మెడిసిన్ విద్యార్థులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 75 వేల కొత్త మెడికల్ సీట్లు పెంచుతున్నామని తెలిపారు. యువత కోసం దేశ వ్యాప్తంగా 5 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రూ. 500 కోట్లతో విద్యలో ఏఐ ఎక్సలెన్సీ సెంటర్ పెడతామన్నారు..
MSME లకు ఆర్థిక మంత్రి నిర్మల వరాలు..*
ఎంఎస్ఎంఈలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరాలిచ్చారు. బడ్జెట్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ, MSMEల కిచ్చే రుణాలు రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్లకు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. స్టార్టప్లకు రూ. 10 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు పెంచినట్లు చెప్పారు. బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు*PM కృషి యోజనతో 1.70 కోట్ల మందికి ప్రయోజనం..*
1.7 కోట్ల రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా కొన్ని ప్రతిపాదనలను నిర్మల సభకు వినిపించారు. రాష్ట్రాలతో కలిసి దేశ వ్యాప్తంగా PM కృషి యోజన కింద అగ్రికల్చరల్ డిస్ట్రిక్ ప్రోగ్రామ్‌ను ఆరంభిస్తున్నట్టు తెలిపారు. బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటుతో పాటు, కంది, మినుములు, మసూర్లను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. పత్తి ఉత్పాదకత పెంచేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు..
బడ్జెట్‌కి ముందు దూసుకెళ్తున్న రైల్వే స్టాక్స్..*
బడ్జెట్‌కు ముందు రైల్వే స్టాక్స్ లాభాల్లో దూసుకెళ్లాయి. బడ్జెట్‌లో రైల్వేకు కేటాయింపులు పెరగొచ్చనే అంచనాలతో రైల్వే స్టాక్స్ లాభాల్లో చేరాయి. 19.67 శాతం లాభంతో జుపిటర్ వాగన్స్ లిమిటెడ్ షేర్లు, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ 12.55 శాతం, టిగాగర్ రైల్ సిస్టమ్ లిమిటెడ్ షేర్లు 13.27 శాతం లాభాల్లో ఉన్నాయి. బీఈఎంఎల్ షేర్లు 10.81, రైట్స్ లిమిటెడ్ 4.74 శాతం, ఇర్కాన్ ఇంటర్నేషన్ 11 శాతం, రైల్ టెల్ 9.23 శాతం చొప్పున రాణిస్తున్నాయి..
: *కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పూజలు చేసిన ఇన్వెస్టర్..*
ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ లలో మార్పులొస్తాయేమోనని ఆశతో ఎదురు చూస్తున్న ఉద్యోగులు..
బడ్జెట్ తమకు అనుకూలంగా ఉండాలని వేడుకుంటూ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు పూజలు చేస్తున్న ఇన్వెస్టర్..