*హైదరాబాద్, సెప్టెంబర్ 06:* గణేష్ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో ప్రజలకు సౌకర్యం కొరకు, నిమజ్జనం చేయడానికి వీలుగా 73 లొకేషన్లలో వివిధ రకాల పాండ్ లను అందుబాటులోకి తేవడం జరిగినది. గణేష్ ఉత్సవాలు సందర్భంగా నగర వ్యాప్తంగా 73 పాండ్ లను జిహెచ్ఎంసి సిద్ధం చేసింది. 73 పాండ్ లలో 27 బేబీ పాండ్స్, 24 పోర్టబుల్, 22 ఎస్కవేటివ్ పాండ్స్ ఏర్పాటు చేసారు. అందులో పెద్ద పెద్ద విగ్రహాలు కాకుండా 2 ఫీట్ల నుండి 5 ఫీట్ల చిన్న విగ్రహాలు నిమజ్జనం చేయడానికి వీలుగా ఉంటుంది. గణపతి ఉత్సవాలను పురస్కరించుకుని పర్యావరణ పర్యావరణ హితమైన గణనాథుల పూజ కోసం జిహెచ్ఎంసి ప్రత్యేకంగా మట్టితో ఏర్పాటు చేసిన మూడు లక్షల పదివేల విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేసింది. ఇక మండపాల నుండి గణనాధులను నిమజ్జనానికి తీసుకువెళ్లే మార్గాల్లో ఎలాంటి అవంతరాలు లేకుండా చెట్ల కొమ్మలను తొలగించడం రోడ్లపై ఏర్పడ్డ గుంతలను పూడ్చివేసి సరైన విధంగా గణేష్ శోభాయాత్ర జరిగేందుకోసం ఏర్పాట్లు చేసింది జిహెచ్ఎంసి. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో అన్ని వీధులలో వీధి దీపాలు వెలిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు… శానిటేషన్ నిర్వహణపై కూడా శ్రద్ధ పెట్టాలని ఆయా విభాగాల అధికారులకు కమిషనర్ ఆమ్రపాలి కాట ఆదేశించారు. శోభాయాత్ర సందర్భంగా ప్రధాన రోడ్లలో నిత్యం శానిటేషన్ పరిరక్షించేలా ప్రతి కిలోమీటర్కు ఒక టీం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చెత్తను తొలగించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. నిమజ్జనం జరిగే ప్రదేశాలలో అన్ని వసతులు ,సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ముఖ్యంగా స్ట్రీట్ లైట్లు, త్రాగునీరు, మొబైల్ టాయిలెట్స్,క్రేన్ లను ఏర్పాటు చేసారు. నిమజ్జనం చేసిన విగ్రహాలను అలాగే పూజ సామాగ్రి నీ వెను వెంటనే తొంగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు మండపం వద్ద పరిశుభ్రంగా ఉండే విధంగా నిర్వాహకులు కృషి చేయాలని దోమల నివారణ కు చర్యలు తీసుకోనున్నట్లు కమిషనర్ తెలిపారు…