*ఘనంగా ప్రజా పాలన -క్రీడా విజయోత్సవాలు*
*పలు జిల్లాలో 2kరన్ కార్యక్రమాలు*
ప్రజాపాలన క్రీడా విజయోత్సవాల్లో భాగంగా
ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో
అన్ని జిల్లా కేంద్రాల్లో వివిధ క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు.
నూతన ప్రభుత్వం ఏర్పాటు యాడాది పూర్తికావస్తున్న సందర్భంగా ప్రజా విజయోత్సవాల్లో భాగంగా
తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడా విజయోత్సవాల పేరిట ఈ కార్యక్రమాలు రూపొందించారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొన్నారు
హనుమకొండ జిల్లా కేంద్రంలో జరిగిన 2కే రన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అడిషనల్ కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణి పాల్గొన్నారు.
దీనితోపాటు వివిధ జిల్లా కేంద్రాల్లో జరిగిన కార్యక్రమంలో యువ క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .
రాష్ట్రప్రభుత్వం క్రీడలకు చారిత్రాత్మక బడ్జెట్ ను కేటాయించిక్రీడారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది
.
నూతన క్రీడా విధానము, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, పలు జాతీయ అంతర్జాతీయ పోటీలకు తెలంగాణను వేదికగా మార్చడంతో పాటు ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ 2024 నిర్వహించి గ్రామీణ స్థాయి నుండి అంచలంచలుగా తెలంగాణ క్రీడారంగాన్ని అభివృద్ధి పరిచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది
డిసెంబర్ 7 నుండి గ్రామీణ స్థాయి సీఎం కప్ పోటీలు ప్రారంభం కాబోతున్నాయని, ఇందు కొరకు మొట్టమొదటిసారిగా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఈ పోటీలో పాల్గొనే ప్రతి ఒక్క క్రీడాకారుడి సమాచారం పొందుపరిచే విధంగా సమాచార వ్యవస్థను రూపొందించడం జరిగింది.
రాష్ట్రంలో ఉన్న యావత్ క్రీడాకారుల సమాచారం ఒక్క చోట చేర్చే విధంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చర్యలు తీసుకుంటుంది