*చెరువుల అభివృద్ధికి జీహెచ్ఎంసీ విశేష కృషి*
*హైదరాబాద్, డిసెంబర్ 21:* చెరువులు అన్యాక్రాంతం కాకుండా సంరక్షించడంతో పాటు చుట్టూ ఉన్న ప్రజానికానికి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు జిహెచ్ఎంసి విశేష కృషి చేస్తుంది.
నగరంలో పలు చోట్ల చెరువులను అన్యాక్రాంతం చేసిన బాదితుల పై కఠిన చర్యలు తీసుకుంటూ భవిష్యత్ తరాలవారికి వాటి ఫలాలను అందించే ప్రయత్నంలో భాగంగా ప్రణాళికను సిద్దం చేస్తున్నది. ముందుగా చెరువులు, కుంటలు ఏ సామర్థ్యంలో ఉంది. దాని యొక్క నీటి సామర్థ్యం ఫుల్ ట్యాంక్ లెవెల్ (FTL) తో పాటుగా చెరువు విస్తీర్ణం ఉంటే ఎంత బఫర్ జోన్ ఉండాలో ఇంతకు ముందు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాని ప్రకారం కూడా బఫ్ఫర్ జోన్ గుర్తింపు, దానికి తోడు నాలా వెడల్పును బట్టి కూడా బఫ్ఫర్ జోన్ గుర్తింపు చేయుటకు తెలంగాణ ప్రభుత్వం దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.
ఈ నేపథ్యంలో నగరంలో ప్రస్తుతం ఉన్న 185 చెరువులను కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో ఇప్పటి వరకు సుమారు 90 నుండి 100 చెరువులను సుందరీకరణ చేయడం జరిగింది. అన్యాక్రాంతం కాకుండా అన్ని చెరువులకు ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లను దిమార్కేశన్ చేయానైనది. జిహెచ్ఎంసి వ్యాప్తంగా ఉన్న చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో చెరువులు నిర్దేశించిన నీటి సామర్థ్యాన్ని (FTL) స్థిరంగా ఉంచడం, మురికి నీరు రాకుండా ప్రక్కకు తరలించడం, అందుకు కట్ట మరమ్మత్తులు చేసి పటిష్టపరచడం, వర్ష కాలంలో క్రింది ప్రాంతాలకు లోతట్టు ప్రాంతాలకు ఇబ్బందులు లేకుండా చేయడం కోసం స్లూస్ (తూముల) నిర్మాణాలు, అంతేకాకుండా సర్ప్లస్ నీరును మత్తడి ద్వారా తొందరగా వెళ్లకుండా మత్తడి నిర్మాణాలు చేయడం కోసం జిహెచ్ఎంసి వ్యాప్తంగా ఉన్న చెరువులను అభివృద్ధికి ప్రాధాన్యత నివ్వడం జరిగింది. వర్షం వచ్చి వరద వలన లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు గురికారికాకుండా చెరువులో ఉన్న నీటి యాజమాన్య పద్ధతులు పాటించడం, గతంలో ఉన్న నీటిని ముందస్తుగా క్రిందకు పంపించి వచ్చే వర్షం నీటి వలన లోతట్టు ప్రాంతంలో నివసించే ప్రజలకు ఎలాంటి సమస్యలు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం మూలంగా ఇలాంటి వ్యూహాత్మక చర్యల వలన చెరువులు కుంటల క్రింద లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి వరద ముంపు సమస్య లేకుండా జిహెచ్ఎంసి వ్యాప్తంగా చేయడం జరిగింది. ఈ విషయం చెరువులు, కుంటల లోతట్టు ప్రాంత నివాసులకు తెలుసు.
అది అలా ఉండగా నగర పౌరులకు కాలుష్యం లేకుండా జీవన ప్రమాలను కాపాడుకొనేందుకు చేపట్టిన చర్యలతో పాటుగా చెరువుల వలన ఆరోగ్యకరంగా, మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు చెరువుల వద్ద సుందరీకరణ పనుల పై జిహెచ్ఎంసి పెద్ద యెత్తున చర్యలు తీసుకుంది. ఇంతకు ముందు చెప్పినట్లుగా కట్ట స్లూస్ మత్తడి పటిష్టత చేయడం జరిగింది. సుందరీకరణ పనులను చేపట్టి చెరువులు అన్యాక్రాంతం కాకుండా సంరక్షించడం ప్రజలలో ఆసక్తి కల్పించడం జరిగింది. గార్డెన్, పూల మొక్కలు కూర్చోవడానికి కుర్చీలు, వాకింగ్ ట్రాక్, యోగ చేయుటకు ల్యాండ్ అభివృద్ధి, చిన్న పిల్లలు ఆడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం, క్రీడాకారులు ఆడుకునేందుకు ఆట స్థలం ఏర్పాటు చేసి ప్రజలకు కాలుష్యం లేని వాతావరణ కల్పించి, ఆహ్లాదకరంగా జీవించడం కోసం జిహెచ్ఎంసి కృషి చేస్తున్న ది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జి హెచ్ ఎం సి వ్యాప్తంగా ఉన్న జంక్షన్లు, ఫ్లైఓవర్ల సుందరీకరణకు విశేష కృషి చేస్తున్నట్లు జిహెచ్ఎంసి కమిషనర్ ఇలంబర్తి తెలిపారు.
ఈ నేపథ్యంలో నగరంలో రూ.60.85 కోట్ల అంచనా వ్యయంతో 34 చెరువుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాగా అందులో 10 పనులు పూర్తి కాగా మరో 18 పనులు వివిధ ప్రగతి దశలో కలవు మిగితా పనులు టెండర్ దశలో కలవు.