వినూత్న ఆధునిక పద్దతి లో ఎలాంటి దుర్వాసన లేకుండా డంపు యార్డుల ఏర్పాటు కు జి హెచ్ ఎం సి ప్రతిపాదనలు.
*జవహర్ నగర్ చెత్త శుద్ధి కేంద్రం పై భారం తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై జీహెచ్‌ఎంసీ కసరత్తు*.
హైదరాబాద్, సెప్టెంబర్27(:సమయం న్యూస్)- జవహర్ నగర్ చెత్త శుద్ధి కేంద్రం పై భారం తగ్గించేందుకు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించేందుకు జీహెచ్‌ఎంసీ కసరత్తు చేస్తోంది. జీహెచ్‌ఎంసీ నగరం నలుమూలల నుంచి చెత్తను సేకరించి జవహర్‌నగర్ శుద్ధి కేంద్రంకు తరలిస్తుంది. జి హెచ్ ఎం సి నుండి వచ్చే 7,500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలకు అదనంగా పక్కన ఉన్న 17 మున్సిపాలిటీల చెత్తను కూడా జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలిoచడం వల్ల రోజుకు సుమారు 9,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తరలించడవల్ల జవహర్‌నగర్ యార్డ్ పై ఏర్పడుతున్న భారాన్ని తగ్గించడానికి మరియు భవిష్యత్తు అవసరాల కోసం అనువైన స్థలాలనులను గుర్తించడానికి జి హెచ్ ఎం సి ప్రత్యేక చొరవ తీసుకుంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న మేడ్చల్, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో చెత్త శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించేందుకు అధికార బృందం పర్యటించింది.
*ప్యార్ నగర్ లో వినూత్న ,ఆధునిక పద్దతి లో శుద్ధి కేంద్రం ఏర్పాటు*.
సంగారెడ్డి జిల్లా లో ఇది వరకే గుర్తించిన ప్యారానగర్‌లోని 152 ఎకరాల స్థలంలో వినూత్న ,ఆధునిక పద్దాతి అయిన యూరోపియన్ టెక్నాలజీ ఆధారిత
శుద్ధి కేంద్రాల ఏర్పాటుకై అనుమతులు కూడా తీసుకుంది. ఇక్కడ 15 మెగావాట్ల సామర్థ్యంతో వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్‌ను మరియు 270 టన్నుల బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. పూర్తిగా మూసియుండే ట్రక్కులద్వారా రవాణా చేసిన వ్యర్థాలను అండర్ గ్రౌండ్ బంకర్ లో వేసి తడి పొడి గా వేరు చేసిన అనంతరం పొడి వ్యర్థాలనుoడి విద్యుత్తు మరియు తడి వ్యర్థాలనుoడి CBG గ్యాస్ ను తయారు చేస్తారు. ఈ క్రమంలో శుద్ధి కేంద్రంలోని ఎక్కడా కూడా చెత్తను నిల్వ చేయడoకానీ బహిరంగంగా శుద్ధి చెయ్యడంగానీ జరగదు కనుక ఎటువంటి దుర్వాసనలు గానీ వ్యర్థ జలాలు గానీ విడుదలకావు. పూర్తిగా మూసియుండే షెడ్డు లోపల ప్రక్రియ అంతా జరగడం, గాలిని కూడా బయోఫిల్టర్ల ద్వారా శుద్ధి చేసి పునర్వినియోగించడం వల్ల ఎటువంటి దుర్వాసనలు కూడా రావు. డ్రై డైజెసన్ టెక్నాలజీ ద్వారా తడిచెత్తనుండి బయోగ్యాస్ తయారు చెయ్యడం వల్ల లీచెట్ సమస్యకూడా ఉండదు.
*మరి కొన్ని ప్రాంతాల పరిశీలన:*
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో 42.22 ఎకరాలను,
సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు మండలం లక్డారం గ్రామంలో 100 ఎకరాలు, దుండిగల్‌లో 85 ఎకరాలు, చౌటుప్పల్ మండలం మల్కాపూర్ వద్ద 200 ఎకరాలు గుర్తించారు.
ప్రతిపాదిత స్థలంలో చెత్త శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు గుర్తించిన భూములను జీహెచ్‌ఎంసీకి కేటాయించేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపాలని కమిషనర్ ఆమ్రపాలి ఆయా జిల్లాల కలెక్టర్లను కోరారు.