Thursday, December 26, 2024
HomeUncategorizedజిహెచ్ఎంసి హెడ్ పరిధిలో  ప్రజావాణి లో

జిహెచ్ఎంసి హెడ్ పరిధిలో  ప్రజావాణి లో

*జిహెచ్ఎంసి పరిధిలో ప్రజావాణి కి నేడు 164 ఆర్జీలు*

*ప్రజావాణి విజ్ఞప్తుల సత్వర పరిష్కారం పై దృష్టి సారించాలి: కమిషనర్ ఆమ్రపాలి కాట*

*హైదరాబాద్, సెప్టెంబర్ 23( సమయం న్యూస్):*   ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించడం పై ఆయా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాట అధికారులకు ఆదేశించారు.

జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యల పరిష్కారానికి నగరం నలుమూలల నుండి ప్రజలు తరలి వచ్చారు. కమిషనర్ ఆమ్రపాలి కాట ఒకొక్కరి సమస్యను అడిగి తెలుసుకుంటూ విజ్ఞప్తులను స్వీకరించారు. ఆయా ఆర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి వెంటనే చర్యలు తీసుకొని పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… జాప్యం లేకుండా ప్రజావాణిలో వచ్చిన విన్నపాలపై దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఆయా విభాగాల అధికారులకు సూచించారు.

ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా 7 విన్నపాలు రాగా సంబంధిత అధికారులకు పరిష్కారానికి పంపారు.
 
జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 72 విన్నపాలు రాగా అందులో టౌన్ ప్లానింగ్ 48, హౌసింగ్ 6, రెవెన్యూ 5, ఎఫ్.ఏ 4, హెల్త్ 3, ఎస్టేట్ 2, ఎల్.డబ్ల్యూ,ఎస్, ఎలక్ట్రికల్, సి.ఈ మెయింటెనెన్స్, వెటర్నరీ విభాగాలకు ఒకటి చొప్పున విన్నపాలు వచ్చాయి. 

జిహెచ్ఎంసి పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 92 అర్జీలు వచ్చాయి. అందులో కూకట్ పల్లి జోన్ లో 54, ఎల్బీనగర్ జోన్ లో 14, సికింద్రాబాద్ జోన్ లో 11, శేరిలింగంపల్లి జోన్ లో 09, చార్మినార్ జోన్ లో 3, ఖైరతాబాద్ జోన్ లో ఒక అర్జీలు వచ్చాయని తెలిపారు. 
  
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమీషనర్లు నళిని పద్మావతి, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, యాదగిరి రావు, పంకజ, సిసిపి శ్రీనివాస్, అడిషనల్ సిసిపి ప్రదీప్ కుమార్, జాయింట్ కమిషనర్ మహేష్ కులకర్ణి, ఆయా విభాగాల అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments