
నిరుద్యోగులకు రూ.3 వేలు: సీఎం చంద్రబాబు
నిరుద్యోగులకు రూ.3 వేలు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు త్వరలోనే నెలకు రూ.3,000 భృతి అందిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం సీఎం వెల్లడించారు. ఇప్పటికే రూ.6.50లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ పూర్తి చేశామని ఆయన తెలిపారు. తాజా పెట్టుబడుల ద్వారా ఏపీలో 5 లక్షల ఉద్యోగాలు రానున్నాయని నిరుద్యోగులకు సీఎం శుభవార్త చెప్పారు.