Thursday, November 21, 2024
HomeUncategorizedనిందితుడిని జైలుకు పంపాం:జైనూర్ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం : ఇరు వర్గాల...

నిందితుడిని జైలుకు పంపాం:

జైనూర్ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం :

ఇరు వర్గాల ప్రజలు సంయమనం పాటించాలి :

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రెస్ మీట్ :

ఉట్నూర్ : జైనూర్ మండలంలో ఓ మహిళపై అఘాత్యానీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకొని జైలుకు పంపారని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.  గురువారం ఉట్నూరు మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.జైనూర్ మండల కేంద్రంలో బుధవారం జరిగిన ఘటన బాధాకరమని అన్నారు.జిల్లా ఇంచార్జి మంత్రి వర్యులు సీతక్క డిజీపితో మాట్లాడి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు.ఇరు వర్గాలు సంయమనం పాటించాలన్నారు.ఆదివాసీలను అడ్డంపెట్టుకొని కొందరు ప్రశాంతవంతమైన వాతావరణాన్ని చెడగొట్టే కుట్ర పన్నుతున్నారని,ఈ ఘటనలో బీజేపీ,బిఆర్ఎస్ నాయకులు హస్తం ఉందన్నారు.అమాయక ఆదివాసి యువతను మభ్యపెట్టి వారి జీవితాన్ని సర్వ నాశనం చేయడానికి కొన్ని సంఘ విద్రోహ శక్తులు కుట్ర పన్నుతున్నాయని, ఆదివాసి యువత ఎవరో చెప్పిన మాటలు విని ఆగం కావొద్దని విజ్ఞప్తి చేశారు.సార్మెడీలు,పటేల్లు, ఆదివాసీ యువతకు మంచి మార్గం వైపు నడిపించాలని కోరారు.ఘటన జరగడానికి ముందు డిఎస్పీ వ్యవహరించిన తిరును డీజీపికి తెలుపుతామన్నారు.రాష్ట్ర ప్రభుత్వంపై బురద జెల్లడానికి బీజేపీ,బిఆర్ఎస్ నాయకులు ఇలాంటి హింసాత్మాకమైన ఘటన జరగడానికి కారకులైనారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Previous article
*రాచకొండ కమీషనరేట్‌లో 2.0 కోట్లు విలువ గల  దొంగిలించిన మొబైల్ ఫోన్స్ రికవరీ చేసిన పోలీసులు..*

ఇప్పుడు పెరుగుతున్న మొబైల్ పరికరాల వినియోగం కారణంగా మొబైల్ ఫోన్ల దొంగతనాలు/నష్టాలు పెరుగుతున్నాయి. తరువాత ఈ ఫోన్‌లను వివిధ మార్గాల ద్వారా కొనుగోలు చేసే వివిధ వ్యక్తులు ఉపయోగించారు. అటువంటి మొబైల్ ఫోన్‌లను ట్రేస్ చేయడానికి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (భారత ప్రభుత్వం) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (CEIR) పోర్టల్‌ను సులభతరం చేసింది. ఫోన్ పోయినప్పుడు లేదా దొంగిలించబడినప్పుడు, మొబైల్ పరికరం యొక్క అటువంటి నష్టం/దొంగతనంపై నివేదికపై, సంబంధిత పోలీసు స్టేషన్ దాని కార్యాచరణను ట్రాక్ చేయడానికి CEIR పోర్టల్‌లో పోయిన/దొంగిలించబడిన మొబైల్ ఫోన్ యొక్క IMEIని అప్‌లోడ్ చేయవచ్చు. IMEI యాక్టివేట్ అయిన తర్వాత, తదుపరి చర్య కోసం అదే పోర్టల్‌లో ప్రతిబింబిస్తుంది.

రాచకొండ కమిషనర్ జి. సుధీర్ బాబు, IPS కమీషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ సూచనల మేరకు, CEIR పోర్టల్‌ని ఉపయోగించి మొబైల్ ఫోన్‌లను కనుగొనడానికి IT సెల్ రాచకొండ సమన్వయంతో CCS LB నగర్, మల్కాజిగిరి మరియు భోనగరి లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందాలు 25 రోజుల వ్యవధిలో రూ. 2.0 కోట్ల విలువైన 591 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నాయి.

LB నగర్ 339

భువనగిరి 104

మల్కాజిగిరి 149

మొత్తం

591 మొబైల్స్

ఇప్పటివరకు, ఈ సంవత్సరంలో రాచకొండ పోలీసులు CEIR పోర్టల్‌ని ఉపయోగించి రికవరీ పైన ఉన్న 3213 మొబైల్ ఫోన్‌లను రికవరీ చేశారు. ఈ ఏడాది మొబైల్ ఫోన్ రికవరీలో హైదరాబాద్ తర్వాత రాచకొండ రెండో స్థానంలో నిలిచింది.

ఈరోజు కమీషనర్ ఆఫ్ పోలీస్, రాచకొండ రికవరీ చేసిన మొబైల్ ఫోన్‌లను నిజమైన యజమానులకు అందజేసి, వారితో సంభాషించి, ఈ విషయంలో పోలీసుల పనితీరుపై వారి అభిప్రాయాన్ని తీసుకున్నారు. నిజమైన యజమానులు తమ కోల్పోయిన మొబైల్ పరికరాలను స్వీకరించినందుకు పోలీస్ సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందించారు
Next article
**వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ఉచితంగా నిత్యావసరాల పంపిణీ*మంత్రి నాదెండ్ల మనోహర్*

* రేషన్ కార్డు లేనివారికి ఆధార్ కార్డు ద్వారా పంపిణీ
* రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు

వరద ముంపు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీకి అన్ని ఏర్పాట్లూ చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. 25 కిలోలు బియ్యంతోపాటుగా లీటరు పామాయిల్, కేజీ పంచదార, కేజీ పప్పు, 2 కేజీలు ఉల్లి పాయలు, 2 కేజీలు బంగాళా దుంపలు అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ-పోస్ మిషన్ ద్వారా సరుకులు పంపిణీ జరుగుతుందన్నారు. 2 లక్షల మందికి సరుకులు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. రేషన్ కార్డులు లేనివారికి ఆధార్ కార్డులు ద్వారాగానీ తంబ్ ఇంప్రెషన్ ద్వారాగానీ పంపిణీ చేయాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చామని స్పష్టం చేశారు. గ్యాస్ కంపెనీలు కూడా సేవలందించేందుకు ముందుకు వచ్చాయన్నారు. ముంపు ప్రాంతాల్లో 12 సర్వీస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
నేటి నుంచి సబ్సిడీ ధరలతో కూరగాయలు విక్రయాలు మొదలయ్యాయి అన్నారు.
విజయవాడలో వచ్చిన ఇటువంటి విపత్తు ఎప్పుడూ చూడలేదనీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సహాయక చర్యలు పకడ్బందీగా జరుగుతున్నాయని తెలిపారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments