Thursday, December 26, 2024
HomeUncategorizedనీటి పారుదల రంగానికి తీసుకున్న  అప్పులకు విధించిన వడ్డీ పూర్తి గా లేదా  పాక్షికంగా తగ్గించండి...

నీటి పారుదల రంగానికి తీసుకున్న  అప్పులకు విధించిన వడ్డీ పూర్తి గా లేదా  పాక్షికంగా తగ్గించండి – ఉత్తం కుమార్ రెడ్డి.



రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇప్పుడు ప్రభుత్వానికి ఆర్థికంగా భారంగా మారినందున వాటిపై విధించిన వడ్డీని పూర్తిగా లేదా పాక్షికంగా తగ్గించేలా కేంద్రప్రభుత్వరంగ ద్రవ్య సంస్థలను ఒప్పించేలా చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వీలైతే మొత్తంగా క్లియర్ చేయాలని, లేదా పాక్షికంగానైనా మాఫీ చేయాలని కోరినట్లు తెలిపారు.


మంగళ వారం నాడు న్యూ ఢిల్లీ లోని భారత మండపంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న 8వ ఇంటర్నేషనల్ వాటర్ వీక్ సదస్సు- 2024 కు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సదస్సు నేటి నుండి నాలుగు రోజుల పాటు కొనసాగనుంది.
ఈ కార్యక్రమంలో  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. ప్రతి ఏటా సుమారు ఆరు లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టును సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో రూ. 29 వేల కోట్లను ఈ రంగానికి కేటాయించినట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ కృషికి తోడుగా కేంద్రం నుంచి తగిన సహాయ సహకారాలు కావాల్సిందిగా ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం ఏ విధంగానైతే దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను పెంపొందించడం కోసం లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తామని పార్లమెంటులో ప్రకటించారో  అదేవిధంగా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం కోసం అదే స్ధాయిలో కేటాయించాలని మంత్రి కోరారు.   ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధుల రూపంలో సాయం అందడంతో పాటు వివిధ రకాల క్లియరెన్సులను కూడా త్వరిగతిన ఇచ్చేలా చొరవ తీసుకోవాలని తన ప్రసంగం ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా పలు సాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు తరఫున సాఫ్ట్ లోన్ కావాల్సిందిగా ఆ రెండు సంస్థల ప్రతినిధులతో ఆయన ఈ రోజు చర్చించారు.. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సమ్మక్క-సారలమ్మ ఇరిగేషన్ ప్రాజెక్టులోని కొంత ముంపు భాగం చత్తీస్‌గడ్ రాష్ట్ర పరిధిలో ఉన్నందున దీన్ని పూర్తి చేయడానికి, కేంద్రం నుంచి క్లియరెన్సులు రావడానికి ఆ రాష్ట్రం నుంచి ఎన్ ఓ సీ రావాల్సి ఉన్నదని, ఆ ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా ఆ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి కేదార్ కశ్యప్‌తో చర్చించినట్లు తెలిపారు.

చత్తీస్‌గడ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సమ్మక్క-సారలమ్మ ప్రాజెక్టుకు అన్ని రకాల క్లియరెన్సులు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వమూ చొరవ తీసుకోవాలని ఈ వేదిక నుంచి మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్‌తో ఈ విషయంతో పాటు రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి గత అప్పులపై వడ్డీని పూర్తిగా మాఫీ చేయడం లేదా తగ్గించాలని, చత్తీస్‌గడ్ నుంచి ఎన్ ఓ సీ లభించేందుకు కేంద్రం చొరవ తీసుకోవాల్సిందిగా మంత్రి విజ్ఞప్తి చేశారు.. ఈ కార్యక్రమంలో 40 దేశాల నుంచి ప్రతినిధులతో పాటు మన దేశంలోని 20 రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ మంత్రులు, ఎన్జీవో సంస్థల ప్రతినిధులు, నిపుణులు, పాలసీ మేకర్స్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments