హైదరాబాద్.సెప్టెంబర్06:- జంట జలాశయాలకు కొనసాగుతున్న వరద ఎప్పుడైనా గేట్లు ఎత్తే అవకాశం =================================
జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంతాల్లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్లకు క్రమంగా వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కు 1300 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా.. ఉస్మాన్ సాగర్ కు 1800 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. భారత వాతావరణ శాఖ సూచన నివేదిక ప్రకారం రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే గేట్లు తెరిచే అవకాశం ఉంటుంది. దీంతో జలమండలి అధికారులు సంబందిత హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగంతో పాటు.. జీహెచ్ ఎంసీ, పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు.
1. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం – 1763.50 అడుగులు ప్రస్తుత నీటి స్థాయి – 1760.60 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం – 2.970 టీఎంసీ లు ప్రస్తుత సామర్థ్యం – 2.377 టీఎంసీ లు
2. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం – 1790.00 అడుగులు ప్రస్తుత నీటి స్థాయి – 1787.20 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం – 3.90 టీఎంసీ లు ప్రస్తుత సామర్థ్యం – 3.264 టీఎంసీ లు