Thursday, December 26, 2024
HomeUncategorizedపరకాల  నియోజక వర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధికి సమిష్టి కృషి అవసరం.

పరకాల  నియోజక వర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధికి సమిష్టి కృషి అవసరం.

**పరకాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో  అభివృద్ధి కి సమిష్టి కృషి చేద్దాం*
*ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి*

హన్మకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్ల తో  నియోజక వర్గ అభివృద్ధి పై సమీక్షా.

**సోలార్ పవర్ ప్లాంట్ , డైరీ ఫాం, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో మహిళలకు శిక్షణ తో  ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేయాలి**



వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో  శుక్రవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి  నిర్వహించిన వివిధ అభివృద్ధి  కార్యక్రమాల అమలు తీరుపై  వరంగల్,హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారద,పి.ప్రావీణ్య తో  కలిసి  రెండు జిల్లాల వివిధ శాఖ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు

ఈ  సమావేశంలో  ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా లో పరకాల  నియోజక వర్గం  అభివృద్ధి లో మిగితా నియోజక వర్గాల  కంటే అభివృద్ధి లో చాలా వెనుకబడి ఉందని నియోజక  వర్గాన్ని అభివృద్ధి  లో  మిగితా నియోజక వర్గాల కంటే ప్రగతి లో ముందించేందుకు ప్రతి ఒక్కరూ  సమిష్టి గా  కృషి చేసినప్పుడే సాధ్యమవుతుందని అన్నారు అందుకు రెండు జిల్లాల కలెక్టర్లు,  సంబంధిత జిల్లా అధికారుల కృషి ఎంతో అవసరమని అన్నారు.

జిల్లాల్లో మహిళా సాధికారతతో చేపట్టే కార్యక్రమాలను  మెప్మా,  గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా  నియోజకవర్గ వహిళకు ప్రాధాన్యత నివ్వలన్నారు ముఖ్యంగా పట్టణ, గ్రామీణ ప్రాంత సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఆసక్తి గల రంగాల్లో శిక్షణ కల్పించి మహిళ ను ఆర్థిక  అభివృద్ధికి సోలార్ పవర్ ప్లాంట్, డైరీ ఫామ్  ఏర్పాటు మీ సేవ, ఇతర వ్యాపార రంగాల్లో  నిష్ణాతులు చేసి కుటుంబ ఆదాయం పెరిగేలా కార్యాచరణ చేయాలని అధికారులను  రేవూరి ప్రకాశ్ రెడ్డి  ఆదేశించారు,  ఈ విషయంలో జిల్లా కలెక్టర్ లు ప్రత్యేక చొరవ చూపి నియోజక వర్గంలో మహిళ సాధికారిత సాధించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు అదేవిధంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మహిళలకు కుట్టు శిక్షణ ఇస్తూ   ఉపాధి అవకాశాలు కల్పించుటకు ఏర్పాట్లుచేయాలని  శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి  జిల్లా  కలెక్టర్లను కోరారు.

ప్రజా పాలన లో  ప్రభుత్వం  మహిళా సాధికారత లక్ష్యంగా మన ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి గారు  మహిళలకు  సముచిత స్థానం కల్పించుట కు మహిళా సాధికారత సాదించుటలో భాగంగా  డైరీ ఫామ్ ఏర్పాటుకు  దిశ నిర్దేశం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్లను కోరారు.

పరకాల నియోజక వర్గ అభివృద్ధికి మండలానికో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయుటకు కావల్సిన  ప్రభుత్వ భూములను  సేకరించేందుకు  తహసీల్దార్లకు తగు ఆదేశాలు  జారీ చేయాలని  కలెక్టర్లను కోరారు భూసేకరణ చర్యలను వేగవంతంగా పూర్తి చేసే యుద్ధ ప్రాతిపదికన నియోజక వర్గ  మహిళలకు ప్లాంట్ ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే  జిల్లా కలెక్టర్లను  ఆదేశించారు.


ప్రస్తుత పరిస్థితుల్లో పాల ఉత్పత్తి ఎంతైనా అవసరం అని ప్రజలకు నాణ్యమైన పాలు అందించుటకు,మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించుటకు  డైరీ ఫాం అవసరముందని అందుకు కావలసిన ఏర్పాట్లు చేయవలసినదిగా  జిల్లా కలెక్టర్లను కోరడమైనది.

ఉకల్,సంగెం,కాపుల కనపర్తి సొసైటి సభ్యులతో ములుకనూర్ డైరీ ని సందర్చించారని ,అందులో దాదాపు 20 వేల మంది మహిళలు విజయవంతంగా  డెయిరీ ఫాంను నడిపిస్తూన్నారని,
తద్వారా రోజుకు దాదాపు 60 నుండి 70 వేల  లీటర్ల పాలు ఉత్పత్తి చేసి హైద్రాబాదు ,  వివిధ ప్రాంతాలకు పాలు సరఫరా చేయగలుగుతున్నారని అదే తరహా లో నియోజక వర్గం అభివృద్ధి కి జిల్లా కలెక్టర్ల తో పాటు జిల్లా యంత్రాంగం కృషి చేయాలని వారు అన్నారు.

ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ  జనవరి 7న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించుటకు గానూ ఆసక్తి గల  మహిళలను ఎంపిక చేయుటకు పరకాల నియోజకవర్గలోని మండలాల వారిగా 500 మందిని ఎంపిక చేసి వారం రోజుల్లో జాబితాను అందజేయాలని  సంబంధిత అధికారులను ఆదేశించడమైనది.

ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ పీ ప్రావీణ్య మాట్లాడుతూ మండలాల వారిగా
పాల ఉత్పత్తి లో మహిళ ఉపాధి అవకాశాలు  మెరుగు పరచడానికి జిల్లాలో పాడి గేదల  పంపిణీ పై  చర్యలు తీసుకోవాలని  సంబంధితశాఖ  అధికారులను ఆదేశించారు.అధిక పాలు  ఇచ్చే పాడి గెదలా  పంపిణీ కి  చర్యలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులకు సూచించారు

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి, పరకాల ఆర్డీవో డాక్టర్ నారాయణ , వరంగల్, హనుమకొండ డిఆర్ డి ఓ పి డి లు కౌసల్యాదేవి,యం శ్రీనివాస్, ఎల్ డి ఎం రాజు, శ్రీనివాసులు, టి జి ఐ ఐ సి జోనల్ మేనేజర్ స్వామి,హన్మకొండ వరంగల్  జిల్లాల  సంబంధిత శాఖ  అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments