
పోసానికిపై మరోకేసు.. విచారణ అధికారిపై హైకోర్టు ఆగ్రహం
మహాశివరాత్రి రోజున అరెస్టు అయి నెల రోజుల తరువాత బెయిల్‌పై విడుదలైన సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళీ (Posani Krishna Murali) పై తాజా మరో కేసు (Case) నమోదైంది. టీవీ5 (TV-5) ఛానల్ చైర్మన్, టీటీడీ (TTD) చైర్మన్ బీఆర్ నాయుడు (B.R. Naidu)పై సోషల్ మీడియాలో పోస్టు (Post) పెట్టారన్న కారణంతో సూళ్లూరుపేట (Sullurupeta) లో కేసు నమోదైంది. కాగా, పోలీసులు నమోదు చేసిన తాజా కేసును రద్దు చేయాలంటూ పోసాని హైకోర్టు (High Court) ను ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ నిర్వహించిన న్యాయస్థానం.. కీలక ఆదేశాలు జారీ చేసింది.
సూళ్లూరుపేట కేసులో తదుపరి చర్యలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. అంతేకాక, ఈ కేసులో విచారణ అధికారి (Investigating Officer) గా వ్యవహరిస్తున్న మురళీకృష్ణ (Murali Krishna) పై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరించారని పేర్కొంటూ, ఆయన తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. 111 సెక్షన్, మహిళను అసభ్యంగా చిత్రీకరించారని సెక్షన్లు ఈ కేసులో ఎలా వర్తిస్తాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు నిర్ణయంతో పోసానికి తాత్కాలిక ఉపశమనం లభించినట్లైంది.