Thursday, April 17, 2025
HomeUncategorizedప్రభుత్వ ఉద్యోగుల..సమస్యల పరిష్కారమే జేఏసీ లక్ష్యం- తెలంగాణ ఉద్యోగ జేఏసీ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల...

ప్రభుత్వ ఉద్యోగుల..
సమస్యల పరిష్కారమే జేఏసీ లక్ష్యం

– తెలంగాణ ఉద్యోగ జేఏసీ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు

: ప్రభుత్వ ఉద్యోగుల..
సమస్యల పరిష్కారమే జేఏసీ లక్ష్యం

– తెలంగాణ ఉద్యోగ జేఏసీ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు

– జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో 37 డిమాండ్లతో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావుకు,
జీఏడీ  కార్యదర్శి రఘునంధన్ రావుకు వినతి

     ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే జేఏసీ లక్ష్యం అని జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యలను సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం పరిష్కరించేలా ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.  హైదరాబాద్ లోని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కార్యాలయంలో బుధవారం జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అధ్యక్షతన తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులతో  సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన సమస్యలపై వివిద ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు.

ప్రధానంగా 37 సమస్యలపై వినతి…

తెలంగాణ ఉద్యోగ జేఏసీ సమావేశంలో వివిద ఉద్యోగ సంఘాల ప్రతినిధులు లేవనెత్తిన 37 ప్రధాన సమస్యలపై జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధి బృందం క్యాబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు కె.కేశవరావుకు వివిద ఉధ్యోగ సంఘాల ప్రతినిధులు వినతి పత్రం అందించారు. జేఏసీ వినతి పత్రంపై సానుకూలంగా స్పందించిన కేశవరావు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై త్వరలోనే నిర్వహించనున్న క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకుంటామని హమీ ఇచ్చారని జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి తెలిపారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై జీఏడీ (పొలిటికల్) ముఖ్యకార్యదర్శి రఘునంధన్ రావుకు కూడా 37 సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జేఏసీ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.రామకృష్ణ, టీఏపీయూఎస్ ప్రెసిడింట్ హన్మంత్ రావు, తెలంగాణ ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ దర్శన్ గౌడ్, టీఈఏ ప్రెసిడెంట్ డా.జి.నిర్మల, టీజీటీఏ జనరల్ సెక్రటరీ రమేష్ పాక, ఎస్జీటీయూ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కత్తి జనార్ధన్ రావు, హెచ్ఎండబ్ల్యూఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుగందిని, టీజీ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ మహేష్, టీజీ ఎం అండ్ హెచ్ రాబర్ట్ బ్రూస్, రీడిప్లాయిడ్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ ఈశ్వర్ తో పాటు హెమలత, చంద్రశేఖర్ గౌడ్, కొంగల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.  

వినతి పత్రంలో పేర్కొన్న ప్రధాన డిమాండ్లు..

1. ఉద్యోగుల కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స అందించడం.
2. మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులపై సీలింగ్ పెంపు, పెండింగ్ బిల్లులకు ముందుగానే క్లియరెన్స్ చేయాలి.
3. ఉద్యోగులకు కార్పొరేట్ ఆసుపత్రులలో ఉన్న చికిత్స ధరల ప్రకారం చికిత్స అందించాలి.

4. బిల్లుల క్లియరెన్స్, ఇ-కుబేర్ ద్వారా ప్రాధాన్యతా ప్రాతిపదికన గ్రీన్ ఛానెల్ ద్వారా రూ.10 లక్షలు అందించడం.

5. సాధారణ బదిలీలు ప్రతి సంవత్సరం ఏప్రిల్/మే నెలలో చేపట్టాలి.

6.  జీవో 317లో పౌజ్, మెడికల్, వికలాంగ కేసుల్లో ఉద్యోగుల బదిలీలకు అనుమతి ఇవ్వాలి.
7.జీవో 317 బదిలీలలో సెంట్రల్ స్పౌజ్ కేసులు, ఇంటర్ డిస్ట్రిక్ట్ స్పౌజ్ కేసులను భవిష్యత్ ఖాళీలను గుర్తించాలి.  సీనియారిటీ ప్రకారం ఇతర జోన్‌లకు బదిలీ చేయబడిన ఉద్యోగులు భవిష్యత్తులో గతంలో పనిచేసిన జోన్‌లు/మల్టీ జోన్‌లలో ఏర్పడే ఖాళీలలో తిరిగి తీసుకోవాలి.

8. ఇతర జిల్లాలకు బదిలీ చేయబడిన ఉద్యోగులను వారి స్థానిక జిల్లాలకు కేటాయించాలి.

9. జీవో 317 పోర్టల్‌లో ఒంటరి ఉద్యోగులకు ఎంపిక చేపట్టాలి.

10. హెచ్‌ఆర్ పాలసీని అమలు చేయడానికి, అవుట్ సోర్స్ ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించడానికి ప్రైవేట్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలను తొలగించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి.

11.అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, హెల్త్ కార్డులు జారీ చేయాలి.

12. సార్వత్రిక ఎన్నికల సమయంలో బదిలీ చేయబడిన తహశీల్దార్లు/నాయబ్ తహశీల్దార్లు మరియు ఇతర అధికారులను స్వంత ప్రాంతాలకు బదిలీ చేయాలి.

13. గ్రామ పరిపాలన అధికారి (GPO)గా రెవెన్యూ శాఖలో తిరిగి రావాలని ఆప్లన్లు ఎంచుకున్న VROలు మరియు VRASలకు ప్రమోషన్ ఛానెల్‌ని ఏర్పాటు చేస్తూ జాబ్ చార్ట్ రూపొందించాలి.

14.అర్హత ప్రకారం 61 మంది VRAలు GPO పోస్ట్‌ కొరకు ఆప్షన్లు ఇవ్వాలి.
15. అన్ని డిపార్ట్‌మెంట్లలోని క్యాడర్ వారీగా ఉన్న ఖాళీలను పదోన్నతి ద్వారా రిక్రూట్‌మెంట్ లేకుండా భర్తీ చేయవచ్చు.

16. బకాయిలతో పాటు 01.01.2025 నాటికి పెండింగ్‌లో ఉన్న డియర్‌నెస్ అలవెన్స్‌ల విడుదల చేయాలి.

17. వేతన సవరణ సంఘం నివేదికను ఖరారు చేయాలి. పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లందరికీ 51% ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలి.

18.తెలంగాణలోని వివిధ శాఖల అధికారులకు కేటాయించిన వాహనాల హైర్ ఛార్జీల పెండింగ్ చెల్లింపుల విడుదల చేయాలి.

19. గృహ నిర్మాణ అడ్వాన్స్ ఫెస్టివల్ అడ్వాన్స్  రుణాలు మరియు అడ్వాన్సులను పెంచాలి.

20. రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ రోజున పెన్షనరీ ప్రయోజనాలను అందించాలి.

21. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు వార్షిక బడ్జెట్‌ను అందించాలి.

22. 300 రోజుల E.L. సీలింగ్ పరిమితిని 365 రోజులకు పెంచాలి.

23. గ్రాట్యుటీ మొత్తాన్ని రూ.20 లక్షల కంటే ఎక్కువ పెంచాలి.

24. డివిజన్ & మండల స్థాయికి నగరంలో 35% మరియు జిల్లా H.Q.లు 30% కంటే తక్కువ కాకుండా హెచ్‌ఆర్‌ఏ పెంచాలి.

25. సిఆర్‌పిసి సెక్షన్ 197లో అందించిన విధంగా డిపార్ట్‌మెంట్ హెడ్ ముందస్తు అనుమతి లేకుండా, విధులు నిర్వర్తిస్తున్నప్పుడు పబ్లిక్ సర్వెంట్‌లపై ఎటువంటి క్రిమినల్ కేసులు బుక్ చేయవద్దు.

26. దయచేసి ముందస్తు తేదీలో సర్వీస్‌లో ఉండి మరణించిన ఉద్యోగుల బంధువులకు కారుణ్య నియామకాలు ఇవ్వాలి.

27. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌కు బదులుగా పాత పెన్షన్ స్కీమ్ ను అమలు చేయాలి.

28. CPS ఉద్యోగి మరణించిన సందర్భాల్లో, మరణించిన కుటుంబానికి కుటుంబ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు, CPS ఫండ్‌కు మినహాయించబడిన మొత్తం మరణించిన ఉద్యోగుల బంధువులకు తిరిగి ఇవ్వాలి.

29. రెవెన్యూ ఉద్యోగుల కోసం రెవెన్యూ శిక్షణ అకాడమీ ఏర్పాటు చేయాలి.

30. శారీరక వికలాంగ ఉద్యోగులకు ప్రమోషన్లలో 4% రిజర్వేషన్లు అందించాలి. నిబంధనల ప్రకారం వైకల్య ప్రమాణాల శాతాన్ని 70% నుండి 40%కి తగ్గించాలి.

31. రిక్రూట్‌మెంట్ కౌన్సెలింగ్‌లో శారీరక వికలాంగ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలి.

32. SGT మరియు స్కూల్ అసిస్టెంట్ల పే స్కేల్ మధ్య అసమానత PRCలో తగ్గించాలి.

33. ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు MLC ఎన్నికలలో ఓటు వేసే అవకాశం కల్పించాలి.

34. ప్రతి ప్రాథమిక పాఠశాలలో PS.HM పోస్ట్ మంజూరు చేయాలి.

35. తమ హక్కుల కోసం నిరసనలు చేస్తున్న 1990 సమగ్ర శిక్షా ఉద్యోగులకు న్యాయం చేయాలి.

36. అన్ని విభాగాలలోని ఉద్యోగులకు సురక్షితమైన పర్యావరణం మరియు ఆరోగ్య పని పరిస్థితులను అందించాలి.

37. ప్రభుత్వ ఉద్యోగులందరికీ, సంబంధిత జిల్లాల హెడ్ క్వార్టర్స్‌లో లేదా నిర్దేశించిన ప్రదేశాలలో ఇంటి స్థలాలను కేటీయించాలి: ప్రభుత్వ ఉద్యోగుల..

37. ప్రభుత్వ ఉద్యోగులందరికీ, సంబంధిత జిల్లాల హెడ్ క్వార్టర్స్‌లో లేదా నిర్దేశించిన ప్రదేశాలలో ఇంటి స్థలాలను కేటీయించాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments