Tuesday, February 4, 2025
HomeUncategorizedబడ్జెట్‌కు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం.. రాష్ట్రపతి భవన్‌కు నిర్మలమ్మ..

బడ్జెట్‌కు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం.. రాష్ట్రపతి భవన్‌కు నిర్మలమ్మ..

*బడ్జెట్‌కు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం.. రాష్ట్రపతి భవన్‌కు నిర్మలమ్మ..*

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వం లోని కేంద్ర క్యాబినెట్‌ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశ పెట్టడానికి ముందు మంత్రి మండలి ఆమోదం తీసుకున్నారు. ఉదయం 11 గంటలకు 2025-26 వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశ పెట్టనున్నారు. దీంతో, వరుసగా ఎనిమిదో సారి బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రిగా ఆమె గుర్తింపు దక్కించు కోనున్నారు. అదేవిధంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రికార్డును ఆమె సమం చేయనున్నారు.

కాగా, పార్లమెంట్‌లో బ‌డ్జెట్‌ 2025ను ప్రవేశ పెట్టడానికి ముందు నిర్మలా సీతారామన్‌ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. బడ్జెట్‌ సమర్పణకు ఆమె నుంచి అనుమతి తీసుకోనున్నారు. అంతకుముందు నార్త్ బ్లాక్‌ లోని ఆర్థిక శాఖ‌ విభాగానికి వెళ్లిన నిర్మలమ్మ అక్కడి నుంచి బ‌హీ ఖాతా తీసుకు వ‌చ్చారు. ఎరుపు రంగులో ఉన్న బ‌హీ ఖాతాలో బ‌డ్జెట్ డాక్యుమెంట్లు ఉన్నాయి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments