*బాల్య వివాహాలు చట్ట విరుద్దం: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి*
*హైదరాబాద్, అక్టోబర్ 26:* బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని, ఈ వివాహాలు బాలికల జీవితాలపై తీవ్రమైన దుష్ప్రభావాలు చూపుతాయని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. శనివారం ఆమె బాల్య వివాహాలపై అవగాహన కల్పించేందుకు పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… బాల్య వివాహాల వల్ల అమ్మాయిల జీవితాలు నాశనమవడమేగాక సమాజంపై ఆ ప్రభావం ఉంటుందని తెలిపారు. బాల్య వివాహం చేసుకున్న వారే కాకుండా, అలాంటి వివాహాలకు మద్దతు తెలిపిన వారు, పాల్గొన్నవారు శిక్షార్హులవుతారని చెప్పారు. బాల్య వివాహం తో పేదరికం, ప్రసూతి మరణాలు, శిశు మరణాలు పెరుగుతాయని, అలాగే కుటుంబాల్లో నిరక్షరాస్యత, హింస మరింత పెరుగుతున్నాయని తెలిపారు. బాల్య వివాహాల్లో పాల్గొన్న తల్లిదండ్రులు, బంధువులు కూడా చట్టం ప్రకారం శిక్షార్హులవుతారని, ఈ వివాహాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మేయర్ అన్నారు.
————————————————————–
*- సిపిఆర్ఓ జీహెచ్ఎంసీ ద్వారా జారీ చేయడమైనది.*