Thursday, December 26, 2024
HomeUncategorizedభారీగా పట్టుబడిన గంజాయి  - గంజాయి స్మగ్లర్ అరెస్టు.

భారీగా పట్టుబడిన గంజాయి  – గంజాయి స్మగ్లర్ అరెస్టు.

వరంగల్ సెప్టెంబర్20( సమయం న్యూస్)



*గంజాయి స్మగ్లర్ అరెస్ట్ – భారీగా పట్టుబడిన గంజాయి*

*గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఒక గంజాయి స్మగ్లర్లను హాసన్ పర్తి మరియు తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం పోలీసులు సంయుక్తంగా కలిసి ఆరెస్టు చేశారు. వీరి నుండి పోలీసులు సుమారు 85 లక్షల విలువ గల 338 కిలోల గంజాయితో పాటు  గంజాయిని తరలిస్తున్న ట్రాక్టర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.*

ఈ అరెస్టు కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు  కిలో లక్ష్మీ నారాయణ (24),పాతకోట, వైరామవరం  మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంద్రప్రదేశ్ రాష్ట్రం. మరో నిందితుడు  అల్లూరి సీతారామరాజు జిల్లా కు చెందిన కిలో నారాయణ ఆదేశాల మేరకు నిందితుడు  ఈ నెల 17 వ తారీఖున ఒడిషా రాష్ట్రం , చితరకొండ మండలంకు చెందిన నాటుగురు వద్ద మూడు వందల ముప్పై ఎనిమిది కిలోల గంజాయిని 96 ప్యాకేట్లుగా మార్చి, వాటి ఎవరికి అనుమానం రాకుండా వుండేందుకు ట్రాక్టర్ ట్రాలీ అడుగు బాగంలో రహస్యం ఒక డబ్బాను ఏర్పాటు చేసిన అందులో గంజాయి ప్యాకేట్లను భద్రపర్చి వాటిని ట్రాక్టర్లో ధారకొండ నుండి కామా రెడ్డి జిల్లా, బికనూర్ మండలం వద్దకు , భద్రాచలం, ములుగు , హనుమకొండ , సిద్దిపేట మీదుగా చెరవసే క్రమంలో పోలీసులకు అందిన సమాచారం నిన్నటి రోజున  పోలీస్ అధకారుల ఆదేశాల మేరకు హాసన్ పర్తి ఎస్.ఐ దేవేందర్ రెడ్డి హాసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అనంతర సాగర్ క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా వస్తున్న ట్రాక్టర్ ను పోలీసులు తనిఖీ చేయగా ట్రాలీ అడుగు భాగంలో రహస్యంగా ఏర్పాటు చేసిన డబ్బా లో గంజాయి ప్యాకట్లను గుర్తించిన పోలీసులు గంజాయిని అక్రమ రవాణాకు పాల్పడుతున్న ట్రాక్టర్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. నిందితుడుకి గంజాయి తీసుకరమ్మని చెప్పిన వ్యక్తితో పాటు గంజాయిని అందజేసిన వ్యక్తులు ఇరువురు ప్రస్తుతం పరారీలో వున్నారు.
గంజాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం ఏసీపీ సైదులు, కాజీపేట ఏసీపీ తిరుమల్ , తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం ఇన్స్ స్పెక్టర్ సురేష్ , హసన్ పర్తి ఇన్స స్పెక్టర్ చేరాలు ఎస్. ఐ దేవేందర్ , రవితో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.
ఈ మీడియా సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏసీపీలు దేవేందర్ రెడ్డి, నందిరాం నాయక్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments