


*మత సామరస్యానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శనంగా నిలుస్తుంది: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి*
*హైదరాబాద్, మార్చి 31* రంజాన్ పండుగ సందర్భంగా భోలక్ పూర్ వార్డు కార్పొరేటర్ గౌస్ మొయినుద్దీన్ ఆహ్వానం మేరకు సోమవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కార్పొరేటర్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పోరేటర్ మేయర్ ను సన్మానించి షిరుకుమను అందించారు.
ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ… మత సామరస్యానికి తెలంగాణా రాష్ట్రం ఇతర రాష్ట్రాల కంటే ఆదర్శంగా నిలుస్తుందని, ముస్లిం హిందువులు స్నేహపూర్వకంగా ఉంటూ మతాలకు అతీతంగా స్నేహభావంతో ఉంటారని ముఖ్యంగా హైదరాబాద్ నగరం గంగా యమునా తేహజీబ్ గా భారతంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ముస్లిం హిందూ పండగలకు కలిసి మెలిసి ఉంటూ అన్నదమ్ముల జరుపుకునే వేదికగా హైదరాబాద్. నిలుస్తుందన్నారు. ఈదుల్ ఉల్ ఫితర్ (రంజాన్) పండుగకు ఆహ్వానించిన కార్పొరేటర్ గౌస్ మొయినుద్దీన్, వారి కుటుంబ సభ్యులకు మేయర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగకు ఇంటికి పిలిచి దావత్ ఇచ్చిన కార్పొరేటర్ గౌస్ మొయినుద్దీన్ కు హృదయపూర్వక అభినందనలు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.