
*మద్యం సేవించి వాహనం నడపడం నేరం చట్టపరమైన చర్యలు తప్పవు*
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
మద్యం సేవించి వాహనం నడపడం నేరమని, వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.
వానదారులు మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా పత్యక్షంగాని, పరోక్షంగాని రోడ్డు ప్రమాదాలకు ప్రధానకారకులు కావడంతో కొన్ని సందర్బల్లో సదరు మద్యం సేవించి వాహనదారుడు సైతం రోడ్డు ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. తద్వారా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇది దృష్టిలో వుంచుకోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ మద్యం సేవించి వాహనదారుల వలన కలిగే రోడ్డు ప్రమాదాల నివారణకై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఇందులో భాగం వరంగల్ ట్రైసిటి పరిధిలో ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్ధర్ పోలీసులు నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీలు చేపట్టడం జరుగుతుందని. అలాగే గ్రామీణా ప్రాంతాల్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీలు నిర్వహించబడుతున్నాయి. ప్రధానం వరంగల్ ట్రై పరిధిలో ట్రాఫిక్ పోలీసులు చేపట్టే తనీఖీల్లో పట్టుబడిన వాహనదారులకు ముందుగా కమిషనరేట్ కార్యాలయములోని ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ వాహనదారుల కుటుంబ సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కోర్టులో న్యాయమూర్తి ఎదుట పర్చడం ద్వారా వాహనదారులకు కోర్టులో జైలు శిక్ష లేదా జరిమానా విధించడం జరుగుతుందని. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో గత నెల రోజుల్లో ముమ్మరంగా జరిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీల్లో మొత్తం 3029 కేసులు నమోదు కాగా, ఇందులో 53 మందికి వాహనదారులకు జైలు శిక్ష విధించగా, మరో 15మంది వాహనదారులకు సామాజిక సేవ చేయాలంటూ కోర్టు తీర్పు నివ్వగా, 15లక్షల 72వేల ఆరువందల రూపాయలు వాహనదారులు ఫైన్ రూపంలో కోర్టులో జరిమానాలు చెల్లించారని పోలీస్ కమిషనర్ వెల్లడిరచారు.
మీ కుటుంబాన్ని దృష్టిలో వుంచుకోని వాహనదారులు మద్యం సేవించి వాహనం నడపవద్దని, మీరు చేసే తప్పిదాలతో ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోయినవారు కొందరైతే మరి కొందరు ఆంగవైకల్యంగా జీవితాలను కొనసాగిస్తూన్నారని. ఇకనైన వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని. వాహనదారులు మీ గమ్యానికి సురక్షితంగా చేరుకోవడమే వరంగల్ కమిషనరేట్ పోలీసుల ప్రధాన లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
*వరంగల్ పోలీస్ *కమిషనరేట్ కార్యాలయము*
*పి.ఆర్.ఓ*