*రహదారులపై వరద నివారణకు వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్: జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాట*
*లక్ష లీటర్ల కెపాసిటీ నుండి 10 లక్షల లీటర్ల సామార్ధ్యం గల వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్*
*హైదరాబాద్, సెప్టెంబర్ 25:* నగరంలో వర్షాలు కురుస్తున్ననేపథ్యంలో రోడ్ల పై ఏర్పడిన వరద నివారణ చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిహెచ్ఎంసి అత్యంత కీలకంగా వ్యవహరిస్తుంది.
వరదల వలన ట్రాఫిక్ కు ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రధాన రహదారులపై నీరు నిలువకుండా శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ చేపట్టాలని జిహెచ్ఎంసి ప్రతిపాదించింది.
వర్షాకాలంలో నగరంలో భారీ వర్షాల వలన వాటర్ లాగింగ్ పాయింట్ వద్ద నీరు ఎక్కువగా నిలువడం మూలంగా మొత్తం రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు శాశ్వత పరిష్కారం కోసం లక్ష లీటర్ల సామర్థ్యం నుండి 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ నిర్మాణలు చేపట్టేందుకు ప్రతిపాధించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 100 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వినూత్నంగా 50 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ పనులు చేపట్టాలని నిర్ణయించారు. నగర వ్యాప్తంగా 18 లోకేషన్లలో 23 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ల నిర్మాణాలు చేపట్టారు. చేపట్టిన సంపుల నిర్మాణాలు వరదతో నిండిపోయిన సందర్భంగా వాటిని ఎప్పటికప్పుడు విద్యుత్ మోటర్ల తో స్ట్రామ్ వాటర్ డ్రైన్ లోకి తరలిస్తారు. సంపులో ఎప్పటికప్పుడు నీటి తొలగింపు వలన నీరు నిలువకుండా పోతుంది. తద్వారా ట్రాఫిక్ సమస్య చెక్ పడుతుంది.
నగరంలో ప్రస్తుతం 141 వాటర్ లాగింగ్ పాయింట్ వద్ద వరద నీరు నిలువకుండా 154 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందం, 252 స్టాటిక్ బృందాలు పనిచేస్తున్నాయి. వర్షం వస్తుందని వాతావరణ శాఖ సూచనలు రాగానే సర్కిల్ వారీగా ప్రజలను, అధికారులను ముందస్తు గానే హెచ్చరించి సర్కిల్ స్థాయిలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ లను అప్రమత్తం చేయడం జరుగుతుంది. ఇప్పడు ఉన్న 141 మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్ లను భవిష్యత్తు లో 50 వాటర్ లాగింగ్ పాయింట్ లకు మాత్రమే పరిమితం చేయాలని, ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
*భద్రతా చర్యలు*
వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ (సంపుల) నిర్మాణాల వలన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులకు అదేశించారు. సంపుల వద్ద ప్రమాదాలకు తావివ్వకుండా సరిహద్దులో పటిష్టంగా ఇనుప రాడ్లతో నిర్మాణాలు చేపట్టి అదే విధంగా రాత్రి సమయంలో కూడా విద్యుత్ లైట్స్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటుగా ఒక ఇంఛార్జిగా భాధ్యత గల అధికారిని పర్యవేక్షణ కు మరొక అధికారిని నోడల్ అధికారిగా నియమించాలి. నాలా భద్రత అడిట్ లో అమలులో ఉన్న విధంగా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగిన పక్షంలో అతనినే బాధ్యత వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆమ్రపాలి కాట ఇంజనీరింగ్ అధికారులను అదేశించారు.