Thursday, April 3, 2025
HomeUncategorizedరాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం -9వేల కోట్లు వెచ్చిస్తున్నాం -ఏప్రిల్ 14 వరకు ....

రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం

-9వేల కోట్లు వెచ్చిస్తున్నాం

-ఏప్రిల్ 14 వరకు . స్వీకరణ పొడగింపు

-వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం

-9వేల కోట్లు వెచ్చిస్తున్నాం

-ఏప్రిల్ 14 వరకు . స్వీకరణ పొడగింపు

-వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది, అధికారులు అప్రమత్తంగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. సోమవారం సాయంత్రం ప్రజా భవన్ నుంచి ఆయన చీఫ్ సెక్రటరీ, సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు  సూచనలు చేశారు. నిరుద్యోగ యువత వారి కాళ్లపై వారు నిలబడాలన్న మహోన్నత ఆశయంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి పదివేల కోట్లు ఖర్చు చేస్తుందని, అధికారులు అంతా మనసుపెట్టి పనిచేయాలని, నిరుద్యోగులకు సేవ చేసే భాగ్యం ఈ పథకం ద్వారా అధికారులకు కలుగుతుందని డిప్యూటీ సీఎం సూచించారు. దశాబ్ద కాలంగా నిరుద్యోగ యువతపై ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ నిధులు ఖర్చు చేయలేదన్నారు.  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ ఇది అని వివరించారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకునేందుకు యువత కష్టపడ్డారు.           చిన్న పొరపాటు వచ్చిన అధికారులు వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేయాలని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను ఈ పథకం ప్రగతిపై నిరంతరం సమీక్షిస్తామని అన్నారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ, ఈడబల్యుఎస్ అన్ని వర్గాల గురించి ఆలోచించి మొదటిసారి చేస్తున్న స్వయం ఉపాధి పథకం ఇది అన్నారు. గతంలో మంజూరీ అయినా చివరి వరకు నిధులు విడుదల చేయలేదని అన్నారు. ధరఖాస్తుధారులు ఎంపీడీఓ కార్యాలయాలు, మునిసిపాలిటీలో నేరుగా ధరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. మంత్రులు జిల్లాలకు వచ్చినప్పుడు పథకానికి సంబంధించిన ప్రగతి సమాచారం అందించి వారి నుంచి సలహాలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యేలకు పథకానికి సంబందించిన పూర్తి సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. వరుస సెలవుల నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు దరఖాస్తు గడువు పెంచాలని అధికారులను ఆదేశించారు. జూన్ 2న అర్హులకు శాంక్షన్ లెటర్లు ఇవ్వాలని అన్నారు. దరఖాస్తుల స్వీకరణ మొదలు గ్రౌండింగ్ వరకు నిరుద్యోగ యువత ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో ఒక యువ అధికారిని నియమించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments