Friday, November 22, 2024
HomeUncategorized*రాష్ట్రంలో వరద ప్రభావిత జిల్లాలు 29*    *సోమవారం సి.ఎం.చే సహాయ, పునరావాస చర్యలపై ఉన్నత స్థాయి...

*రాష్ట్రంలో వరద ప్రభావిత జిల్లాలు 29*
    *సోమవారం సి.ఎం.చే సహాయ, పునరావాస చర్యలపై ఉన్నత స్థాయి సమావేశం*

     హైదరాబాద్, సెప్టెంబర్ 6 :  రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలవాళ్ళ  29 జిల్లాలను వరద బాధిత జిల్లాలుగా ప్రకటిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు ఇప్పటికే నాలుగు జిల్లాలను వరద ప్రభావిత జిల్లాలుగా ప్రకటించి వెంటనే తగు సహాయ పునరావాస చర్యలు చేపట్టేందుకు నిధులను సంబంధిత జిల్లా కలెక్టర్లకు విడుదల చేయడం జరిగిందని, అదేవిధంగా మిగిలిన 25 జిల్లాలకు మూడు కోట్ల రూపాయల చొప్పున సంబంధిత జిల్లా కలెక్టర్లకు నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టాలపై సవివర నివేదికను సోమవారం మధ్యాహ్నం లోగా సమర్పించాలని కోరుతూ నేడు రాత్రి జిల్లా కలెక్టర్లతో సి.ఎస్. టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్య దర్శులు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, వికాస్ రాజ్ లతోపాటు పలువురు ముఖ్య కార్య దర్శులు, కార్యదర్శులు ఈ టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, ఆగస్టు 31వ తేదీ నుండి సెప్టెంబర్ మూడవ తేదీల మధ్య కురిసిన భారీ వర్షాల వల్ల నమోదైన వర్షపాతం ఆధారంగా ఈ 29 జిల్లాలను వరద బాధిత జిల్లాలుగా ప్రకటించినట్టు వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సిరిసిల్ల జిల్లాల మినహా అన్ని జిల్లాలను వర్ష ప్రభావిత జిల్లాలుగా  ప్రకటించినట్టు వివరించారు. ఈ జిల్లాలకు వెంటనే తగు తక్షణ పునరావాస చర్యలను చేపట్టేందుకు  జిల్లాకు మూడు కోట్ల రూపాయలను విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేసించారని శాంతి కుమారి తెలిపారు. SDRF నియమ నిబంధనలను అనుసరించి ఈ నిధులను వ్యయం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో వర్షాలు వరదల వల్ల ఏర్పడ్డ నష్టాలపై, చేపట్టాల్సిన పునరావాస కార్యక్రమాలు, అందించాల్సిన సహాయం, పునర్నిర్మాణ కార్యక్రమాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన సోమవారం నాడు ఉన్నతస్థాయి సమావేశాన్నిఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వరదలు వర్షాల జరిగిన నష్టాల    వివరాలను నిర్ణీత నమూనాలో సమర్పించేందుకుగాను జిల్లాల వారీగా సీనియర్ అధికారులను ప్రత్యేకంగా నియమిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 29 మంది మరణించారని వీరికి ఎక్స్ గ్రేషియా అందించేందుకు వివరాలు పంపాలని తెలిపారు. జిల్లాల వారీగా జరిగిన పంట నష్టం, పాడి పశువుల మరణాలు, ఇతర వ్యవసాయ సంబంధిత నష్టాల వివరాలతో పాటు దెబ్బతిన్న రాష్ట్ర, జిల్లా, పంచాయతీ రహదారుల వివరాలు, దెబ్బతిన్న కల్వర్టులు బ్రిడ్జిలు, పాఠశాల భవనాలు, తాగునీటి సరఫరా పైప్ లైన్ ల వివరాలతో కూడిన నివేదిక పంపాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

Previous article
*గణేష్ నిమజ్జనానికి 73 లోకేషన్లలో పాండ్స్ ఏర్పాటు*


*హైదరాబాద్, సెప్టెంబర్ 06:*  గణేష్ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో ప్రజలకు  సౌకర్యం కొరకు, నిమజ్జనం చేయడానికి వీలుగా 73 లొకేషన్లలో   వివిధ రకాల పాండ్ లను అందుబాటులోకి తేవడం జరిగినది. గణేష్ ఉత్సవాలు సందర్భంగా నగర వ్యాప్తంగా 73 పాండ్ లను జిహెచ్ఎంసి సిద్ధం చేసింది. 73 పాండ్ లలో 27 బేబీ పాండ్స్, 24 పోర్టబుల్, 22 ఎస్కవేటివ్ పాండ్స్ ఏర్పాటు చేసారు. అందులో పెద్ద పెద్ద విగ్రహాలు కాకుండా  2 ఫీట్ల నుండి 5 ఫీట్ల చిన్న విగ్రహాలు నిమజ్జనం చేయడానికి వీలుగా ఉంటుంది.
గణపతి ఉత్సవాలను పురస్కరించుకుని పర్యావరణ  పర్యావరణ హితమైన గణనాథుల పూజ కోసం జిహెచ్ఎంసి ప్రత్యేకంగా మట్టితో ఏర్పాటు చేసిన మూడు లక్షల పదివేల విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేసింది. ఇక మండపాల నుండి గణనాధులను నిమజ్జనానికి తీసుకువెళ్లే మార్గాల్లో ఎలాంటి అవంతరాలు లేకుండా చెట్ల కొమ్మలను తొలగించడం రోడ్లపై ఏర్పడ్డ గుంతలను పూడ్చివేసి సరైన విధంగా గణేష్ శోభాయాత్ర జరిగేందుకోసం ఏర్పాట్లు చేసింది జిహెచ్ఎంసి. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో అన్ని వీధులలో వీధి దీపాలు వెలిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు… శానిటేషన్ నిర్వహణపై కూడా శ్రద్ధ పెట్టాలని ఆయా విభాగాల అధికారులకు  కమిషనర్ ఆమ్రపాలి కాట ఆదేశించారు. శోభాయాత్ర సందర్భంగా ప్రధాన రోడ్లలో నిత్యం శానిటేషన్ పరిరక్షించేలా ప్రతి కిలోమీటర్కు ఒక టీం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చెత్తను తొలగించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.  నిమజ్జనం జరిగే ప్రదేశాలలో అన్ని వసతులు ,సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ముఖ్యంగా  స్ట్రీట్ లైట్లు, త్రాగునీరు, మొబైల్ టాయిలెట్స్,క్రేన్ లను ఏర్పాటు చేసారు. నిమజ్జనం చేసిన విగ్రహాలను అలాగే పూజ సామాగ్రి నీ  వెను వెంటనే తొంగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు     తెలిపారు
మండపం వద్ద పరిశుభ్రంగా ఉండే విధంగా నిర్వాహకులు కృషి చేయాలని దోమల నివారణ కు చర్యలు తీసుకోనున్నట్లు కమిషనర్  తెలిపారు…

Next article
న్యూస్ అలెర్ట్:
===========

హైదరాబాద్.సెప్టెంబర్06:-
జంట జలాశయాలకు కొనసాగుతున్న వరద
ఎప్పుడైనా గేట్లు ఎత్తే అవకాశం
=================================

జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంతాల్లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్లకు క్రమంగా వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కు 1300 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా.. ఉస్మాన్ సాగర్ కు 1800 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది.
భారత వాతావరణ శాఖ సూచన నివేదిక ప్రకారం రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే గేట్లు తెరిచే అవకాశం ఉంటుంది. దీంతో జ‌ల‌మండ‌లి అధికారులు సంబందిత హైద‌రాబాద్ మ‌రియు రంగారెడ్డి జిల్లాల‌ ప‌రిపాల‌నా యంత్రాంగంతో పాటు.. జీహెచ్ ఎంసీ, పోలీసు అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు.

1. హిమాయ‌త్ సాగ‌ర్  పూర్తి స్థాయి నీటి మ‌ట్టం – 1763.50 అడుగులు
ప్ర‌స్తుత నీటి స్థాయి – 1760.60 అడుగులు

రిజ‌ర్వాయ‌ర్ పూర్తి సామ‌ర్థ్యం – 2.970 టీఎంసీ లు
ప్ర‌స్తుత సామ‌ర్థ్యం – 2.377 టీఎంసీ లు

2. ఉస్మాన్ సాగ‌ర్  పూర్తి స్థాయి నీటి మ‌ట్టం – 1790.00 అడుగులు
ప్ర‌స్తుత నీటి స్థాయి – 1787.20 అడుగులు

రిజ‌ర్వాయ‌ర్ పూర్తి సామ‌ర్థ్యం – 3.90 టీఎంసీ లు
ప్ర‌స్తుత సామ‌ర్థ్యం – 3.264 టీఎంసీ లు
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments