రెండు రోజుల క్రితం వరంగల్ సి కె ఏం ఆసుపత్రి లో
పసికందుని అపహరించిన కిలాడి లేడీ అరెస్టు
వరంగల్ సెప్టెంబర్ 09 ( సమయం న్యూస్ ,)నిందితురాలి పేరు జుగునకే సునీత D/o భావ్ రావ్, వయసు:38 సంవత్సరాలు, కులము: పర్ధన్ , నివాసము: ఇంటి నెంబర్:1-5-174/4, గాంధీ చౌక్, అదిలాబాద్. ప్రస్తుతము సుందరయ్య నగర్ అదిలాబాద్ ఆమె సొంతూరు సార్కాని గ్రామము నాందేడ్ జిల్లా మహారాష్ట్ర పదో తరగతి వరకు అక్కడే చదువుకున్నాది , అమ్మ రాధాబాయి అదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ లో పనిచేసేది నాన్న చిన్నప్పుడే చనిపోయినాడు అమ్మ లాక్ డౌన్ లో కరోనాతో చనిపోయింది తర్వాత ఆదిలాబాద్ సుందరయ్య నగర్ లో ఇల్లు కిరాయికి తీసుకొని సుమారు నాలుగు సంవత్సరాలు నుండి అదే ఇంట్లో ఉంటున్నాది , తర్వాత తనకు ఉట్నూర్ కి చెందిన ఆత్రం ఆనందరావు అలియాస్ నందు పరిచయమైనాడు తర్వాత ఇద్దరు ఇష్టపడి హోల్వాడి ఉట్నూరులో పెళ్లి చేసుకున్నారు తర్వాత ఇద్దరూ కలిసి అదిలాబాదులో సుందరయ్య నగర్ లో కలిసి ఉండేవాళ్ళ
తర్వాత నందు తనతో సరిగా ఉండకుండా వేరే వాళ్ళతో మాట్లాడుతూ తనను పట్టించుకునే వాడు కాదు గత మూడు నెలల నుండి హైదరాబాదులో వేరే అమ్మాయితో ఉంటూ తనను పట్టించుకోకపోవడంతో దాంతో తను ఒంటరిగా ఉండలేక ఏదైనా చిన్న బాబుని
దత్తత తీసుకొని పెంచుకోవాలని అనుకున్నది ఆ ప్రకారంగా సుమారు పది రోజుల క్రితం కరీంనగర్ లోని ప్రతిమ హాస్పిటల్ కి వెళ్లగా అక్కడ వీలు కాలేదు తర్వాత వారం రోజుల క్రితం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా అక్కడ కొందరు గోండువాళ్లు కనబడగా, తన గోండు భాషలో మాట్లాడి పరిచయం చేసుకొని ఏం జరిగిందని తెలుసుకునగా, ఆతని భార్య ఏడు నెలలకే ఒక మగ బాబుని ప్రసవించిందని, ఏడు నెలలకే బాబు పుట్టడంతో బాబుని డబ్బా లో పెట్టినారని, చెప్పగా ఇదే అదనుగా ఆ బాబుని ఎలాగైనా ఎత్తుకెళ్లాలని పథకం ప్రకారం అమాయకులైన ఆ గోండు వాళ్ళతో బాబుకి సీరియస్ గా ఉన్నది ఇక్కడ సరిగా ట్రీట్మెంట్ చేయరు, వరంగల్లో చిన్నపిల్లలకి మంచిగా ట్రీట్మెంట్ జరుగుతుంది తీసుకెళ్దాం అని మాయమాటలు చెప్పి డాక్టర్లతో మేము వేరే ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకుంటామని చెప్పి వారిని వరంగల్ కి తీసుకు వచ్చింది, అప్పుడు తనతో పాటు ఇద్దరు ఆడవాళ్లు ఒక మగ వ్యక్తి వచ్చినారు వాళ్ళని MGM ఆసుపత్రి కి తీసుకువచ్చి వారిని బయటనే ఉండమని చెప్పి తను లోపటికి వెళ్లి అడ్మిట్ చేసి వస్తానని చెప్పి లోపలకి వెళ్ళి ఆరోజు ఆ పాపను తన పేరు సునీత మీద అడ్మిట్ చేసినది ఆ తర్వాత రోజు బాబు వాళ్ళ తండ్రి వచ్చి మేము బాబుని తీసుకెళ్తాం మాకు ఇక్కడ ట్రీట్మెంట్ అవసరం లేదు అనగా తను వెంటనే బాబుకి సీరియస్ గా ఉన్నదని బాబుని హైదరాబాద్ కి తీసుకెళ్లాలని డాక్టర్లు చెప్పినారని మనం తీసుకెళ్లకపోతే బాబు ప్రాణాలకే ప్రమాదం అని చెప్పిన వాళ్లు వినకపోవడంతో తను వెంటనే ఇక్కడే వరంగల్లో వేరే ఆసుపత్రి కి తీసుకెళ్లి అక్కడ చూపెట్టిన తర్వాత మంచిర్యాల కి తీసుకెళ్తామని చెప్పి CKM హాస్పిటల్ కి తీసుకెళ్లినది అక్కడ వాళ్లందర్నీ హాస్పిటల్ బయటనే ఉండమని లోపలికి వెళ్లి డాక్టర్ కి చూపెట్టి వస్తానని అబద్ధం చెప్పి వాళ్ళ కళ్ళు కప్పి వాళ్ళకి తెలియకుండా బాబుని అక్కడి నుంచి ఎత్తుకెళ్లి పోయినది అక్కడి నుండి బాబును తీసుకొని వరంగల్ రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడి నుండి నిజామాబాద్ కి వెళ్లి అక్కడినుండి తన సొంత్తూరు సార్కానికి వెళ్ళినది తర్వాత
ఈరోజు ఉట్నూర్ లో తన భర్త నందు వాళ్ళ ఇంట్లో తన బట్టలు తీసుకొని మళ్ళీ ఆదిలాబాద్ కెళ్ళి ఉందామని బస్టాండ్లో దిగగా అక్కడ పోలీస్ వాళ్ళు పట్టుకొని వరంగల్ కి తీసుకువచ్చినారు
తర్వాత బాబుని పోలీసు వారు ఎసిపి వరంగల్ నందిరాం సార్ సమక్షంలో అతని తండ్రి అయిన రాజేష్ కి అప్పగించి వెంటనే మళ్ళీ ఎంజీఎం ఆస్పత్రిలో ట్రీట్మెంట్ గురించి చేర్పించడం జరిగింది
ఇందితురాలు సునీతని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది
పసికందుని అపహరించి 24 గంటల లోపలనే నిందితురాలిని, బాబుని అదుపులోకి తీసుకొని వారి తల్లిదండ్రులకు అప్పగించి బాబు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తపరిచినారు నిందితురాలని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ వెంకన్న సిబ్బంది ఉపేందర్ మహేందర్ లను ఎసిపి గారు అభినందించారుసన్