Friday, November 22, 2024
HomeUncategorizedవరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే బొజ్జ విస్తృత పర్యటన : వాగుదాటి గ్రామస్తుల సమస్యలను తెలుసుకున్న...

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే బొజ్జ విస్తృత పర్యటన :

వాగుదాటి గ్రామస్తుల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే :


కోతకు గురైన రోడ్ల, పంట పొలాల పరిశీలన :

మెరుగైన విద్యాను అందించాలి :

డిఈతో మాట్లాడి తాత్కాలిక రోడ్లు వేయాలని ఆదేశం :

అదిలాబాద్ సెప్టెంబర్06- (సమయం న్యూస్):  ఇంద్రవెల్లి మండలం లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కోతకు గురైన రోడ్లను ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ శుక్రవారం పరిశీలించారు.ఇంద్రవెల్లి మండలంలోని ఆంజి గ్రామంలో పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చట్టించి బోర్డుపై ప్రశ్న ఇచ్చి సమాధానం రాబట్టు కున్నారు.పాఠశాలలోని వంటగదిని పరిశీలించారు.విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. పాఠశాల అభివృద్ధి పనుల కోసం 15 లక్షలు మంజూరు చేశారు.అనంతరం వడగావ్ గ్రామంలో పర్యటించారు.జెండా గూడా గ్రామస్తులు ఎమ్మెల్యేను కలసి బ్రిడ్జి నిర్మాణం చేయాలనీ కోరగా..డిఈతో ఎమ్మెల్యే ఫోన్ లో మాట్లాడి బ్రిడ్జి నిర్మాణానికి అయ్యే ఖర్చుల నివేదికలు తమకు ఇవ్వాలని ఆదేశించారు.గ్రామస్తులతో కలసి వాగు దాటి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.లాల్-టెక్డి సమీపంలోని కోతకు గురైన రోడ్డును పరిశీలించారు.జిల్లా కలెక్టర్ రాజర్షిషా తో ఫోన్ లో మాట్లాడి వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించాలని కోరారు.రాకపోకల కోసం తాత్కాలిక రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించారు.పంట పొలంలోకి వెళ్లి రైతుతో మాట్లాడి పంట నష్టంపై అరా తిశారు.అనంతరం పాఠశాలను సందర్శించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.ప్రకృతి వైపరీత్యాల కారణంగా భారీ నష్టం వాటిల్లిందని,రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు.వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ తో మాట్లాడి రైతులకు పంట నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.రైతు రుణమాఫీ విషయంలో రైతులేవరు ఆందోళనకు గురి కావొద్దని, ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Previous article
Next article
*డెబిట్ కార్డ్స్ లేకుండా ఏటీఎంలలో డబ్బులు డిపాజిట్ చేయొచ్చు*

బ్యాంకు డిపాజిట్ మెషిన్స్ లో డబ్బులు డిపాజిట్ చేయాలంటే డెబిట్ కార్డు వాడాల్సిందే. సొంత బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేసుకోవాలంటే కనుక డెబిట్ కార్డు ఉండాలి. దీని వల్ల ఖాతా వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. అదే డెబిట్ కార్డు వాడకపోతే కనుక ఖాతా నెంబర్, ఫోన్ నెంబర్ వంటి వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. కొంతమంది నగదు డిపాజిట్ చేయడానికి వచ్చేటప్పుడు డెబిట్ కార్డు మర్చిపోతూ ఉంటారు. కొంతమందికి డెబిట్ కార్డు లేకుండా నగదు డిపాజిట్ చేయలేమా అని అనిపిస్తుంది. అలాంటి వారి కోసమే ఆర్బీఐ కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. ఏటీఎంలలో డెబిట్ కార్డ్స్ అవసరం లేకుండా యూపీఐ ద్వారా డబ్బు డిపాజిట్ చేసేందుకు కస్టమర్స్ కి అనుమతి కల్పించేలా కొత్త ఫీచర్ ని ప్రారంభించింది.

ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ 2024లో భాగంగా యూపీఐ ఇంటరాపరబుల్ క్యాష్ డిపాజిట్ (యూపీఐ-ఐసీడీ) సర్వీసుని డిప్యూటీ గవర్నర్ టి రవి శంకర్ ఆవిష్కరించారు. ఈ ఫీచర్ తో కస్టమర్లు తమ బ్యాంకు ఖాతాకు లేదా వేరే బ్యాంకు ఖాతాలకు డెబిట్ కార్డ్సు లేకున్నా యూపీఐ ద్వారా నగదు డిపాజిట్ చేయొచ్చు. మొబైల్ నంబర్ తో లింక్ అయి ఉన్న యూపీఐ లేదా వర్చువల్ పేమెంట్ అడ్రస్ (వీపీఏ) లేదా బ్యాంకు ఐఎఫ్ఎస్సీ ద్వారా ఖాతాదారులు క్యాష్ డిపాజిట్ చేయవచ్చు. ఈ సర్వీసుని కస్టమర్లు వినియోగించుకోవాలంటే కనుక క్యాష్ ఏటీఎం మెషిన్ లో యూపీఐ-లింక్డ్ మొబైల్ నంబర్ ఆప్షన్ ని గానీ.. వర్చువల్ పేమెంట్ అడ్రస్ ఆప్షన్ ని గానీ ఎంచుకోవాలి. ఆ తర్వాత మెషిన్ లోని డిపాజిట్ స్లాట్ లో డబ్బులు ఉంచాలి.

మీరు నమోదు చేసిన యూపీఐ-లింక్డ్ మొబైల్ నంబర్ లేదా వర్చువల్ పేమెంట్ అడ్రస్ కి చెందిన బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. అయితే ఈ యూపీఐ-ఐసీడీ ఫీచర్ కేవలం కొన్ని ఏటీఎంలలో మాత్రమే అందుబాటులో ఉంది. క్యాష్ రీసైక్లర్ టెక్నాలజీతో డిపాజిట్లను, విత్ డ్రాలను రెండిటినీ హ్యాండిల్ చేయగలిగే ఏటీఎంలలో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. బ్యాంకులు క్రమంగా తమ ఏటీఎం నెట్వర్క్స్ లో ఈ ఫీచర్ ని తీసుకురానున్నాయి. ఈ కొత్త ఫీచర్ వల్ల డెబిట్ కార్డులను ప్రత్యేకించి వాడాల్సిన పని ఉండదు. దీని వల్ల కార్డు స్కాములు కూడా తగ్గుతాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఏటీఎం స్లాట్స్ లో ఫేక్ డెబిట్ కార్డు రీడర్ ని ఇన్స్టాల్ చేసి ఖాతాదారుల సొమ్ము కాజేస్తున్నారు. ఇప్పుడు ఈ డెబిట్ కార్డ్ లెస్ ఫీచర్ తో ఇటువంటి స్కాములకు చెక్ పడనుంది.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments