Thursday, November 21, 2024
HomeUncategorizedవిధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారిపై సస్పెన్షన్ వేటు: జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి.

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారిపై సస్పెన్షన్ వేటు: జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి.





పంచాయతీ కార్యదర్శి , గ్రామ ప్రత్యేక అధికారి, ఎం పి ఓ లకు షోకాజ్ నోటసులు.
*పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్


విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నారాయణఖేడ్ మండలం సంజీవరావుపేట జూనియర్ పంచాయతీ కార్యదర్శి సర్వ నాగలక్ష్మి, ఎంపీఓ ఇందిరమ్మ, సంజీవరావుపేట గ్రామ ప్రత్యేక అధికారి ,నారాయణఖేడ్ వయోజన విద్య ప్రాజెక్ట్ అధికారి కె వెంకట్ రెడ్డి లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్  క్రాంతి వల్లూరు  జిల్లా పంచాయతీ అధికారి సాయి బాబా ని  ఆదేశించారు.


నారాయణఖేడ్ మండలంలోని సంజీవరావుపేట గ్రామపంచాయతీ పరిధిలో రక్షిత మంచినీటి సరఫరా లో నిర్లక్ష్యం కారణంగా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే .


ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శి ని  జిల్లా అధికారులు సస్పెన్షన్ చేశారు. బాధితులకు వైద్య సహాయం అందించడం రక్షిత మంచినీరు సరఫరా కోసం ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమన్వయం చేసుకోవడం లో పంచాయతీ కార్యదర్శి విఫలం చెందడం ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించడం లో విఫలం చెందడం, గ్రామ పంచాయతీ పరిధిలో రక్షిత మంచినీటి సరఫరా పనులు పర్యవేక్షించడంలో విఫలం చెందడం కారణంగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ఫిక్షన్ 43 ( 5) ప్రకారం పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి, ఎం పి ఓ ఇందిరమ్మ, గ్రామ ప్రత్యేక అధికారి కే .వెంకటరెడ్డి లుకు సోకజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీఓపై, గ్రామ ప్రత్యేకాధికారి పై ఎందుకు చర్య తీసుకోకూడదు వెంటనే జిల్లా పంచాయతీ అధికారికి వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. సస్పెన్షన్ గడువు మూసే వరకు పంచాయతీ కార్యదర్శి హెడ్ క్వార్టర్లు అందుబాటులో ఉండాలని షోకాజ్ నోటీసు లో ఆదేశించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments