శీతాకాల విడిదికి హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,
విమానాశ్రయంలో రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేణుగోపాల్ రావు ప్రభుత్వ అధికారులు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికై మంగళవారం సాయంత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా పరిధిలోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక విమానంలో నుంచి దిగిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ,మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేణుగోపాల్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, రాష్ట్ర డీజీపీ జితేందర్, జిల్లా కలెక్టర్ గౌతం పొట్రు శాలువాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి నిలయానికి బయలుదేరారు. ముందుగా విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి లకు మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా , మేడ్చెల్ డిసిపి కోటరెడ్డి, ఎసిపి రాములు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, ఆర్డిఓ సైదులు, తహాసీల్దారు యాదగిరి రెడ్డి సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.