
సంపినోడే సంతాప సభ పెట్టినట్లు ఉంది బీజేపీ తెలంగాణ ఎంపీల తీరు. తెలంగాణ బాగు పట్టని ఎంపీలు..కంచ గచ్చిబౌలిపై రాద్దాంతం చేస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేసారు. అయితే సగటు తెలంగాణ వాది, పర్యవరణ ప్రేమికులు అడుగుతున్న ప్రశ్నలు..
దేశంలో గత పదేళల్లో 16 లక్షల ఎకరాల అడవిని నాశనం చేసిన అధికార బీజేపీకి కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై మాట్లాడే నైతిక హక్కు ఉందా?
మధ్య భారతదేశానికి లంగ్స్ గా చెప్పుకునే చత్తీస్ గడ్ రాష్ట్రంలోని హస్డియో అడవుల్లోని 10 వేల ఎకరాలను అదానీకి కట్టబెట్టిన బీజేపీ నేతలు హైదరాబాద్ లంగ్స్ గురించి మాట్లాడటం కరెక్టేనా?
కార్పొరేట్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు జారీ చేయడానికి బిజెపి ప్రభుత్వం గడువును 600 రోజుల నుంచి 170 రోజులకు కుదించి పర్యవరణ నాశనానికి పచ్చ జెండా ఊపి..తెలంగాణ ప్రయత్నాలను ఎందుకు అడ్డుకుంటున్నారు?
భారీ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయడానికి అవసరమైన.. పర్యావరణ అంచనా ప్రక్రియకు తిలోదకాలిచ్చిన బీజేపీకి ఇప్పుడు పర్యావరణం గురించి మట్లాడటం సహేతుకమేనా?
ఆగస్టు 2014లో నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ (NBWL)లో స్వతంత్ర సభ్యుల సంఖ్యను 15 నుండి 3 కి మోడి ప్రభుత్వం తగ్గించింది. పర్యావరణాన్ని దెబ్బతీసే ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇచ్చే వెసులుబాటును తన గుప్పిట్లో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం…తెలంగాణలో పర్యావరణం గురించి మాట్లాడే హక్కు ఉందా?