Friday, November 22, 2024
HomeUncategorizedసచివాలయం చేరుకున్న కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్.కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్...

సచివాలయం చేరుకున్న కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్.

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి.

హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు.

వివిధ జిల్లాల్లో జరిగిన వరద నష్టాన్ని కేంద్ర మంత్రికి వివరిస్తున్న అధికారులు.

Previous article
*విజయవాడ మునక వెనుక బుడమేరు వాగు పాత్ర ఎంత? విజయవాడ దుస్థితికి అసలు కారణమేంటి?*

వర్షం, వరద తరువాత విజయవాడ పరిస్థితి దారుణంగా మారింది. కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ చూడనంత విషాదం. కొన్నేళ్లుగా ఎప్పుడూ ఎరుగనటువంటి కష్టం.. నష్టం.

కొండచరియలు విరిగిపడి కొందరు మృతి చెందిన ఘటన.. మనసులను కలచివేస్తుంది. ప్రకృతి బీభత్సానికి, వరుణుడి ప్రకోపానికి గజగజలాడింది బెజవాడ నగరం. అసలు విజయవాడ నగరానికి ఎందుకీ పరిస్థితి వచ్చింది?

భారీ వర్షానికి ఎందుకు చిగురుటాకులా వణికింది? వరద విలయంతో ఎందుకు బిక్కుబిక్కుమంటోంది? బుడమేరు వాగే కొంపముంచిందా? ఎందుకంటే.

ఇటు బుడమేరు, అటు కృష్ణా నది.. మధ్యలో బెజవాడ నగరం. దీంతో వరద మొత్తం నగరాన్ని ముంచేసింది. ఎక్కడ చూసినా నీళ్లు.

ఈమధ్యకాలంలో విజయవాడ ప్రజలకు ఇలాంటి దుస్థితి ఎదురుకాలేదు. సింగ్ నగర్, వాంబే కాలనీ, మార్కండేయ దేవి నగర్.. ఇలా ఎటు చూసినా వరద నీరే దర్శనమిస్తోంది. భారీవర్షాలు, ఆపై వరదలు..

దీంతో విద్యుత్ సరఫరాపై ఇది తీవ్ర ప్రభావం చూపించింది. ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. గంటలకొద్దీ పవర్ కట్ తో సెల్ ఫోన్ టవర్లు కూడా పని చేయలేదు. దీంతో సిగ్నల్స్ లేక, ఛార్జింగ్ లేక మొబైల్ ఫోన్లు కూడా పనిచేయకుండా పోయాయి.
Next article
*వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు*
*బి సి సంక్షేమ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్*

*పాలకుర్తి చాకలి ఐలమ్మ స్మారక భవనానికి స్థల పరిశీలన చేయాలని అధికారులకు ఆదేశాలు*

*చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు,వర్ధంతి కార్యక్రమం కోసం కోసం 15 లక్షలు విడుదల చేసిన బీసీ సంక్షేమ శాఖ*

హైదరాబాద్ , సెప్టెంబర్ 6: (సమయం న్యూస్)ఈనెల 26 వ తేదిన  తెలంగాణ ఉద్యమకారిణి, వీరవనిత తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్యశాలి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా ఘనంగా నిర్వహించడానికి  ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.  2022 నుండి తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రజా పాలన లో కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. సమీక్షా సమావేశంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ,రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన రజక నేతలు పాల్గొన్నారు.

చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు, వర్ధంతి కార్యక్రమం కోసం బీసీ సంక్షేమ శాఖ 15 లక్షల రూపాయలు కేటాయించింది. అందులో ఈనెల 26 న రవీంద్ర భారతిలో జరిగే జయంతి కార్యక్రమాల కోసం 12 లక్షల రూపాయలు కేటాయించగా, 10 వ తేది జరిగే వర్ధంతి కార్యక్రమం కోసం 3 లక్షలు కేటాయించారు.

ఉత్సవాల కోసం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చైర్మన్ గా 40 మందితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. పాలకుర్తి లో చాకలి ఐలమ్మ స్మారక భవన నిర్మాణానికి  ఉన్న అనువైన స్థలాలను అధికారులతో పరిశీలించాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కి సూచించారు. ఇప్పటికే ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహ రోడ్డు పనుల నేపథ్యంలో తొలగించిన గద్దె నిర్మాణం ఇతర ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు..


ఈ నెల 26 వ తేదీన ప్రభుత్వం తరుపున రవీంద్ర భారతిలో అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు జరుపుకోవడంతో పాటు భూమి కోసం, భుక్తి కోసం,విముక్తి కోసం ఆమె త్యాగం గ్రామగ్రామాన తెలిసేలా అన్ని గ్రామాల్లో ఉత్సవాలు జరపాలని కమిటీ సభ్యులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments