Friday, November 22, 2024
HomeUncategorizedసమాజ ప్రగతిలో  ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం- వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య హనుమకొండ:...

సమాజ ప్రగతిలో  ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం
– వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
హనుమకొండ: సమాజ  ప్రగతిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని వరంగల్  ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.

గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్  లోని కాన్ఫరెన్స్ హాలులో  హనుమకొండ జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో  గురుపూజోత్సవం, ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని  నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ఎంపీ  కడియం కావ్య, వరంగల్ పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కె. ఆర్. నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య  జ్యోతి ప్రజ్వలన చేసి  డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్  చిత్రపటానికి పూలమాలలు వేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ  తాము చదువు చెప్పిన విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుంటే గురువులు ఎంతో సంతోషపడతారని  పేర్కొన్నారు. ప్రతి విజేత కూడా  తన విజయానికి కారణం గురువులే అని చెబుతుంటారని అన్నారు. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను  గుర్తించేది ఉపాధ్యాయులేనని తెలిపారు. విద్యార్థులలో దాగి ఉన్న   ప్రతిభను మరింత మెరుగు పరిచే విధంగా గురువులు తోడ్పాటునందించి ఉన్నత స్థాయికి చేరడంలో కృషి చేస్తారన్నారు. కరోనా సమయంలో పిల్లలకు మొబైల్ ఫోన్లను ఇవ్వడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. విద్యార్థులను సమగ్ర మూర్తిమత్వంతో గురువులు తీర్చిదిద్దాలన్నారు. ఈ సందర్భంగా గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉత్తమ ఉపాధ్యాయులుగా  అవార్డులు అందుకున్నవారికి అభినందనలు తెలియజేశారు. 

*వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి* మాట్లాడుతూ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది  ఉపాధ్యాయులేనని  అన్నారు.  విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసేది గురువులేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి రావడంలో ఉపాధ్యాయుల సహకారం కూడా ఎంత ఉందన్నారు. రాబోయే రోజులలో కొత్త వరంగల్ ను చూడబోతున్నారని తెలిపారు.  కొత్త వరంగల్ ను చూడడంలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఉండాలన్నారు. ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ బదిలీలను అత్యంత పారదర్శకంగా నిర్వహించుకున్నామని పేర్కొన్నారు.  గురుపూజోత్సవం సందర్భంగా  సభాధ్యక్షత వహించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు.

*పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి* మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలంటే అది ఉపాధ్యాయులతోనే సాధ్యమని పేర్కొన్నారు. సమాజంలోని వివిధ వర్గాలు ఉపాధ్యాయుల పైన ఎంతో నమ్మకం కలిగి ఉంటారని తెలిపారు. ఉపాధ్యాయులు చేసే సేవలను కొలువలేమని , సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ఎంతో గౌరవం ఉందన్నారు. గురువులు అందించిన ప్రోత్సాహంతోనే ఈ స్థాయిలో మీ ముందున్నానని  చెప్పారు. ఉత్తమ ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.
*వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు* మాట్లాడుతూ ఈ స్థాయిలో ఉండడానికి  తన గురువులే కారణమని  తెలిపారు. తాను డాక్టర్ అవుదామని  అనుకున్నానని, కానీ కాలేకపోయానని   చెప్పారు. తన గురువు కొమురయ్య  జాతీయస్థాయి లో క్రీడాకారునిగా రాణించేలా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. సమాజంలో ఎవరి నుంచి ఏమీ ఆశించని ఉద్యోగం  ఏదైనా ఉందంటే అది ఉపాధ్యాయ వృత్తి మాత్రమేనని అన్నారు. అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు నడిపించే వారే గురువులని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు.

ఈ సందర్భంగా  *హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య* మాట్లాడుతూ విద్యార్థులకు ఉపాధ్యాయులు అందించే విద్యనే అన్ని రంగాల్లో రాణించేలా తోడ్పడుతుందని  అన్నారు. విద్యార్థులు ఉన్నతంగా  రాణించాలంటే  ఉపాధ్యాయుల కృషి ఎంతో అవసరమని పేర్కొన్నారు . జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను అందజేస్తున్నట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో  ప్రభుత్వ పాఠశాలల్లో  మౌలిక వసతులు సమకూరాయని పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో  అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో  ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందని, ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ప్రగతి నివేదికను  జిల్లా విద్యాశాఖ అధికారి  వాసంతి వివరించారు.

ఉత్తమ పనితీరుతో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 31మంది ఉపాధ్యాయులను ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, కలెక్టర్ ప్రావీణ్య  శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందించి అభినందనలు తెలియజేశారు.

హనుమకొండ లోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ పాఠశాల విద్యార్థులు చేసిన స్వాగతం నృత్యం, పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో 49వ డివిజన్ కార్పొరేటర్  ఏనుగుల మానస, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Previous article
Next article
అజ్మీర్ సెక్స్ కుంభకోణంలో 32 ఏళ్ల తర్వాత  కీలక నిర్ణయం!

32 సంవత్సరాల తర్వాత,పోక్సో చట్టం కోర్టు ఈ క్రింది 6 మంది నిందితులకు జీవిత ఖైదు మరియు 5 లక్షల రూపాయల జరిమానా విధించింది.

మహ్మద్ జమీర్
మహ్మద్ నసీమ్
మహ్మద్ సలీం
మహ్మద్ సోహైల్
మహ్మద్ ఇక్బాల్
మహ్మద్ నఫీస్ చిస్తీ

1992లో అజ్మీర్‌లో స్కూల్, కాలేజీ లకు వెళ్లే హిందూ అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారం చేశారు. ఆ అత్యాచారం ఫోటోలు తీసి వీరిని బెదిరించి మరికొందరిని ఉచ్చులోకి లాగారు.

పూర్తి కధ చదవండి:

” ఇది సినిమా కథ కాదు ” (పేర్లు మార్చబడ్డాయి)

అది 1992 వ సంవత్సరం. సోఫియా సీనియర్ సెకండరీ స్కూల్ కి చెందిన ఒక విద్యార్థిని ని మాయ మాటలు చెప్పి ఫరూక్ క్రిస్టీ అనే వాడు లొంగదీసుకుని రేప్ చేశాడు. ఈ క్రిస్టీ రాజస్థాన్ లో గల ప్రముఖ అజ్మీర్ దర్గా వారి కుటుంబానికి చెందిన వాడు. అంతే కాక వీడు అజ్మీర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. వీడు ఆ అమ్మాయిని రేప్ చేసి ఊరుకోలేదు. అభ్యంతరకరమైన ఫోటోలు తీసి ఆ అమ్మాయిని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి, ఆ అమ్మాయి స్నేహితులను తన దగ్గరకు తీసుకురమ్మనమని బలవంతం చేసి, ఆ అమ్మాయి తన ఫోటోలు ఎక్కడ బయట పెడతారో ఆని భయంతో తన స్నేహితులను తీసుకురాగా ఆ పిల్లలతో కూడా ఇలా ఫోటోలు ద్వారా బ్లాక్ మెయిల్ చేసి వారి ద్వారా మరి కొంత మందిని ఈ ఊబి లోకి లాగాడు. ఈ మొత్తం స్కాంలో  పరపతి గలిగిన వ్యక్తులు, రాజకీయ నాయకుల ప్రమేయం కూడా వుండి ఒక అతి జగుస్పాకరమైన, భయంకరమైన సెక్స్ స్కాండల్ కొన్ని సంవత్సరాలు పాటు నడిపారు. ఫిర్యాదులు చేయడానికి సాంఘిక, కుటుంబ సమస్యలు వస్తాయి అని అమ్మాయిలు, కుటుంబ సభ్యులు ఫిర్యాదులు చేయకపోవడంతో, మరీ ధైర్యం తెచ్చుకున్న ఈ గాంగ్ తమ పరిధి విస్తృత పరిచి ఇంకా ఎక్కువ మంది అమ్మాయిలను ట్రాప్ చేయడం మొదలు పెట్టారు. కొన్ని లెక్కలు ప్రకారం 11 సం.ల నుండి 20 సం. ల వయసు గల 250 మంది పిల్లలు వరకూ ఈ ఉచ్చులో చిక్కుకున్నారు అని అంచనా. కానీ అప్పటి డిఐజీ ఒమేంద్ర భరద్వాజ ప్రకారం కొన్ని సం.లు నడిచిన ఈ స్కాం లో లెక్కకు అందని కొన్ని వందల మంది అమ్మాయిలు ట్రాప్ చేయబడ్డారు అని చెప్పారు.ఈ అవమానం భరించలేక చాలా మంది అమ్మాయిలు ఆత్మ హత్యలు కూడా చేసుకున్నారు అని ఆయన చెప్పారు.

ఎవరో ధైర్యం చేసి పోలీసు కంప్లైంట్ ఇచ్చినా అజ్మీర్ దర్గా వారు తమ రాజకీయ పలుకుబడి ఉపయోగించి కేసు ముందుకు వెళ్లకుండా చూసుకున్నారు. అదీ కాక ఇరుక్కున్న అమ్మాయిలు తమ భవిష్యత్ దృష్టిలో వుంచుకుని ఫిర్యాదులు ఇవ్వడానికి ముందుకు రాకపోవడం కూడా ఈ ముష్కరులకు వరం అయింది.

అయితే మదన్ సింగ్ అనే జర్నలిస్ట్ ధైర్యం చేసి ఈ సంఘటన మీద వరుస కథనాలు తన వార పత్రికలో రాయడం తో ప్రజలు నిజాలు తెలుసుకుని పెద్ద యెత్తున నిరసనలు చేయడంతో తప్పని సరి పరిస్థితుల్లో పోలీసులు ఈ ఫరూక్ క్రిస్టీ అనే వాడిని, వాడికి సహకరించిన మరో ఇద్దరు క్రిస్టీలను (వీరు కూడా యూత్ కాంగ్రెస్ సిటీ నేతలు) చివరకు అరెస్ట్ చేశారు.

మొత్తం మీద 18మంది మీద నేరారోపణలు చేయగా నలుగురిని విడిచి పెట్టారు. ఫరూక్ క్రిస్టీ తో సహా 8 మందికి  జీవిత ఖైదు విధించగా,  శిక్షా కాల సమయం అయిపోయింది అని 2013లో హై కోర్ట్ ఫరూక్ క్రిస్టీ ని విడుదల చేసింది. చాలా మంది అమ్మాయిలు కేసు సమయంలో సాక్ష్యాలు చెప్పడానికి ముందుకు రాకపోవడాన్ని మేం అర్ధం చేసుకోగలం అని సుప్రీం కోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఈ కేసు 1980లలో ఉత్తర ఇంగ్లాండ్ రోతెర్ హమ్ లో జరిగిన చైల్డ్ సెక్స్ స్కాండల్ ని గుర్తుకు తెచ్చింది అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఆ స్కాంలో 5గురు పాక్ కి చెందిన బ్రిటన్ పౌరులు అయిన టాక్సీ డ్రైవర్లు పిల్లల సంరక్షణ కేంద్రాల నుండి  10-14 సం.ల వయసు గల పిల్లలను ట్రాప్ చేసి, వారికి మందు, డ్రగ్స్ అలవాటు చేసి వారితో వ్యాపారం 10సం.లు పాటు కొనసాగించారు. ముందు ఫిర్యాదులు వచ్చినా అధికారులు సీరియస్ గా తీసుకోలేదు. చివరికి 2010లో చర్యలు మొదలు పెడితే 5గురు ఒకే కుటుంబానికి చెందిన పాక్ జాతీయులు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు అని కేసు పెట్టారు. 2019 వరకు కూడా ఈ కేసు విచారణ నడిచింది. మొత్తం 1400 మంది పిల్లలు ఈ స్కాం లో ఇరుక్కున్నారు అని తేలింది.

ఇది ఇలా వుండగా ఈ విలేకరి మదన్ సింగ్ మీద ఈ సంఘటనపై వార్తలు రాసే సమయంలోనే హత్యా ప్రయత్నం జరిగింది. అయితే గాయపడ్డ మదన్  ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ వుండగా మళ్ళీ దాడి చేసి అతన్ని హత్య చేశారు. మదన్ చనిపోయే నాటికి మదన్ కి 8,12 సం.ల ఇద్దరు మగపిల్లలు వున్నారు. మదన్ హత్యకు బాధ్యులు అని ముగ్గురు కాంగ్రెస్ నేతలు సవయ్ సింగ్, రాజకుమార్ జైపాల్ మరియు నరేంద్ర సింగ్ పై పోలిసులు హత్య నేరం క్రింద కేసులు పెట్టారు. అయితే  సరి అయిన ఆధారాలు లేవు అని కేసు కొట్టేసి నిందితుల విడుదల కు హై కోర్టు 2012లో ఆదేశాలు ఇచ్చింది.

అయితే,  జనవరి 2023,  7వ తేదీ రాజస్థాన్ లో పుష్కర్ ప్రాంతంలో ఒక రిసార్ట్ లో టీ తాగుతున్న సవాయ్ సింగ్ పై ఇద్దరు కాల్పులు జరిపి చంపేశారు. ఆ కాల్పులు జరిపింది వేరే ఎవరో కాదు 30 సం.ల క్రిందట హత్యకు గురి అయిన విలేకరి మదన్ సింగ్ కొడుకులు సూర్య ప్రతాప్ సింగ్, ధర్మ ప్రతాప్ సింగ్ లు. తమ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇన్ని సం.లుగా ఎదురు చూడగా ఇప్పటికీ అవకాశం కుదిరింది అని ప్రతాప్ సింగ్ చెప్పాడు.

అజ్మీర్ సెక్స్ స్కాండల్ గా ఈ వార్త అప్పట్లో దేశాన్ని నివ్వెరపోయేలా చేసింది. చాలా సం.లు అజ్మీర్ ఆడపిల్లల పెళ్లిళ్లకు తల్లి తండ్రులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొన్న జనవరిలో కూడా ఈ కేసు నిమిత్తం ఒక ఆమెను కోర్టుకు పిలవగా ఎన్నాళ్ళు ఇంకా ఇలా మమ్మల్ని వేధిస్తారు, నేను ఇప్పుడు అమ్మమ్మని అయిపోయాను, నా కుటుంబ సభ్యులకు నేను ఏం చెప్పుకోవాలి? అని జడ్జి గారిని ఆమె గట్టిగా ప్రశ్నించడం ఆమె వంటి వారు పడ్డ మానసిక క్షోభకు నిదర్శనం.

ఈ దారుణం లో అన్యాయం అయిపోయిన ఆడపిల్లలు, స్త్రీలు నేడు చాలా మంది అమ్మమ్మలు, నాయనమ్మలు అయిపోయారు.

*ఇంత సీరియస్ కేసుకే 32సం. లు పట్టింది అంటే,  మన న్యాయ వ్యవస్థ గురించి ఏం చెప్పుకోవాలి?*
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments