జమ్మికుంట మండలం బిజిగిర్ షరీఫ్ గ్రామంలోని ప్రముఖ ముస్లిం పుణ్యక్షేత్రం హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి రహ్మతుల్లాహు అలై దర్గా వందల ఏళ్ళ నుండి కులమతాలకతీతంగా సర్వమతాలకు వేదికగా కుల, మత, వర్గ, సామాజిక వైషమ్యాలకు అతీతంగా భక్తులు దర్షిచించు కుంటారు వేలాది మంది భక్తులు హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి దర్గాను దర్శించుకుంటారు. తమ కష్టాలు తొలగిపోవాలని కోరికలు నెరవేరాలని వేడుకుంటారు. వివిధ జిల్లాల నుండే కాక, మహారాష్ట్రా, ఆంధ్రప్రదేశ్ నుండి కూడా భక్తులు దర్శించుకుంటారు. *దర్గా ప్రాశస్త్యం:-* తెలంగాణాలోనే అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రం బిజిగిరిషరీఫ్ దర్గాను 11వ శతాబ్దంలో నిర్మించినారు. సుమారు 864 సం॥రాల సుదీర్ఘ చరిత్ర ఉన్న దర్గాలో హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి రహ్మతుల్లాహుఆలైతో పాటు ఆయన సోదరుడైన హజ్రత్ సయ్యద్ అజ్మత్ షావలీ వీరి కుమారులైన హజ్రత్ సయ్యద్ ముర్తుజాషావళి, హజ్రత్ సయ్యద్ అక్బర్ షావలి బాబా భార్య తగు హజరత్ సయ్యద అమీనా బీబీ రహమ తుల్లా అలైహి , వారి అత్తమ్మ యగు హజరత్ సయ్యద అఫ్జల్ బి బి ( ర.ఆ) సమాధులున్నాయి. జమ్మికుంట పట్టణానికి తొమ్మిది కిలోమీటర్లు దూరంలో విశాలమైన గుట్టలు, ప్రకృతి రమణీయత ఆహ్లాదకరమైన వాతావరణానికి అనుసంధానమై చారిత్రక ఆధ్యాత్మిక ప్రాశస్త్యం గల ఈ దర్గా కలదు ఇస్లాంతో పాటు అల్లాహ్ సందేశాన్ని దివ్య ఖురాన్ లోనీ సూక్తులను ప్రజలకు తెలియజేస్తు మధ్యయుగాల కాలంలో అరబ్బు దేశం నుండి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ మానవత్వమే మతం అని విశ్వమానవ సమాసత్వాన్ని చాటుతు బిజిగిర్ షరీఫ్ చేరుకొని దర్గాను నిర్మించుకున్న హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి తన జీవిత కాలంలో ప్రదర్శించిన మహిమలు, బాధితుల పట్ల చూపిన కరుణ దయ వల్ల ఎందరో ప్రజలు సుఖ శాంతులలో జీవనం గడుపగలినారు. హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా జిల్ హజ్ మాసంలో 10వ తేది: మూడు రోజుల పాటు ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. నిష్టలతో వేడుకునే భక్తుల కోరికలను హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి తీర్చుతారనీ ప్రసిద్ధి *భక్తుల నమ్మకం-* ప్రజల భక్తి విశ్వాసాలకు చారిత్రాక చిహ్నంగా నిలిచిన ఈ దర్గా పై భక్తులకు ఎనలేని విశ్వాసం ఉంది. దర్గాలో జరిగే ఉర్సు ఉత్సవాలకు హిందు, ముస్లిం, సిక్కు తదితర అన్ని మతాల భక్తులు హాజరవుతుంటారు. దర్గాషరీఫ్ మన దేశంలోని మత సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తోంది. అనేక రుగ్మతలు దీర్ఘకాలిక రోగాలు, మానసిక రోగాలు నయం కావాలని ఇక్కడ వేడుకుంటారు. దర్గాలోని సమాధులకు చాదర్లు సమర్పించి ఉత్సవాలలో పాల్గొంటారు.