Thursday, November 21, 2024
HomeUncategorizedసేఫ్ సిటి ప్రాజెక్టు స్టేటస్ ను సమీక్షించిన రాష్ట్ర డి జి పి జితేందర్.

సేఫ్ సిటి ప్రాజెక్టు స్టేటస్ ను సమీక్షించిన రాష్ట్ర డి జి పి జితేందర్.



సేఫ్ సిటీ ప్రాజెక్ట్ స్టేటస్ ను  సమీక్షించిన  డిజిపి జితేందర్….

రాష్ట్ర పోలీస్ శాఖలో అమలు చేస్తున్న సేఫ్ సిటీ ప్రాజెక్టు స్టేటస్ ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ శనివారం నాడు సమీక్షించారు. సిఐడి డిజిపి  శ్రీమతి  శిఖా గోయల్ , శాంతి భద్రతల అడిషనల్ డిజిపి శ్రీ మహేష్ ఎం భగవత్, పోలీస్ కమిషనర్లు శ్రీ అవినాష్ మహంతి, శ్రీ సుధీర్ బాబు తదితరులు హాజరైన సమీక్షా సమావేశంలో డిజిపి సేఫ్ సిటీ ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితులపై రివ్యూ చేశారు. ప్రాజెక్టు లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు, భరోసా కేంద్రాలు, సీసీటీవీ కెమెరాలు, ఫోరెన్సిక్ ల్యాబ్స్  పెలికాన్ సిగ్నల్స్ తదితర ఏర్పాట్ల పనితీరు గురించి సంబంధిత అధికారులతో చర్చించారు. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ (సి డి ఈ డబ్ల్యూ) సెంటర్ లలో  అదనంగా మరో మూడింటిని మంజూరు చేయాలని సూత్రప్రాయంగా అంగీకరించారు. రాచకొండ పరిధిలోని చౌటుప్పల్ , భువనగిరి, సైబరాబాద్ పరిధిలోని కూకట్ పల్లి లలో  ఆయా కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించారు. నాంపల్లి ప్రాంతంలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ కేంద్రాన్ని, జెహ్ర నగర్ లోని సి డి ఇ డబ్ల్యు కేంద్రాన్ని పూర్తి చేయాలని పోలీస్ హౌసింగ్ అధికారులను  డిజిపి ఆదేశించారు. సేఫ్ సిటీ ప్రాజెక్ట్ నోడల్ అధికారి తరఫున డిసిపి శ్రీమతి డి. కవిత ప్రాజెక్ట్ పరిస్థితిని  వివరించారు. డిసిపిలు శ్రీమతి ఉషా విశ్వనాధ్, శ్రీమతి కే సృజన, శ్రీమతి డి సాయి శ్రీ, జిహెచ్ఎంసి డి ఈ శ్రీ మతి మమత, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి శ్రీ అఖిలేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments