Thursday, November 21, 2024
HomeUncategorized*హన్మకొండ**తేదీ: 05.09.2024**మట్టి గణపతుల పంపిణి కార్యక్రమం వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ డా. కడియం కావ్య.....*జల...

*హన్మకొండ*

*తేదీ: 05.09.2024*

*మట్టి గణపతుల పంపిణి కార్యక్రమం వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ డా. కడియం కావ్య…..*


జల వనరులతో పాటు పర్యావరణం కలుషితం కాకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు అన్నారు.

ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణి కార్యక్రమం వాల్ పోస్టర్ ను హన్మకొండ కనకదుర్గ కాలనిలోని ఎంపీ గారి నివాసంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా ఎంపీ గారు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో కూడిన విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని చేకూరుతుందని, విగ్రహాలను నిమజ్జనం చేస్తే నీరు కలుషితం అవుతుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ పర్యావరణ సంస్థ క్రమం తప్పకుండా మట్టి విగ్రహాలను రూపొందిస్తూ ప్రజలకు పంపిణీ చేస్తుండడం అభినందనీయమన్నారు. ప్రజలు కూడా పర్యావరణ హితం కోసం మట్టి గణపతులనే ప్రతిష్టించాలని హితవు పలికారు.

Previous article
*రేపు ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ పర్యటన*

*వరద నష్టంపై ఏరియల్ సర్వే…అనంతరం అధికారులతో సమీక్ష*

*ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రుల పర్యటన*

*అనంతరం సాయంత్రం 4 గంటలకు కోదాడకు రానున్న బండి సంజయ్*

*కోదాడలోని వరద బాధితుల్లో పర్యటించనున్న బండి సంజయ్*

భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం నష్టపోయిన నేపథ్యంలో కేంద్రం ఏరియల్ సర్వేకు సిద్ధమైంది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రేపు ఉదయం వరదలవల్ల తీవ్రంగా నష్టపోయిన ఖమ్మం జిల్లాల్లో కేంద్ర మంత్రులు ఏరియల్ సర్వే చేయనున్నారు. అందులో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు విజయవాడ నుండి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ నేరుగా ఖమ్మం వస్తుండగా, బండి సంజయ్ కుమార్ ఆయనతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించి వరద నష్టంపై అడిగి తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఖమ్మం జిల్లాలోనే మంత్రులు పర్యటిస్తారు.
అనంతరం శివరాజ్ సింగ్ తిరిగి ప్రత్యేక విమానంలో భోపాల్ వెళతారు. బండి సంజయ్ మాత్రం ఖమ్మం పట్టణంలోని 30వ డివిజన్ మోతె నగర్ లో, 35వ డివిజన్ పంపింగ్ వెల్ రోడ్ లోని పెద్దమ్మ తల్లి దేవాలయ పరిధి సమీపంలోని బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి కోదాడ చేరుకుంటారు. కోదాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. పంట దెబ్బతిన్న పొలాలను పరిశీలిస్తారు. వరదలవల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలతో మాట్లాడతారు. పార్టీ నాయకులు, కార్యకర్తల నుండి వరద నష్టంపై వివరాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మీడియాతో మాట్లాడతారు. కోదాడ పర్యటన అనంతరం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పర్యటనకు బయలుదేరి వెళతారు.
Next article
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments