HomeUncategorized*హన్మకొండ* సమయం న్యూస్ :సెప్టెంబర్06;-*కాలుష్య రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని ఎంపీ...
*హన్మకొండ*
సమయం న్యూస్ :సెప్టెంబర్06;-
*కాలుష్య రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య పిలుపినిచ్చారు……*
వినాయక చవితి సందర్బంగా మెడిహిల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో జుబేదాస్ హోమ్ కేర్ హెల్త్ సర్వీస్ ఆధ్వర్యంలోలో హన్మకొండ కనకదుర్గ కాలనిలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మట్టి వినాయకులను పంపిణీ చేసిన ఎంపీ గారు మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే విధంగా జుబేదాస్ హోమ్ కేర్ హెల్త్ సర్వీస్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేయడం అభినదనీయమని అన్నారు.
అనంతరం ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు మాట్లాడుతూ మట్టిలో నుంచే సకల ప్రాణులు ఉద్భావించాయని చెపుతుంటారని అన్నారు. అసలు వినాయకుడు పుట్టింది పార్వతి దేవి నలుగు మట్టి నుంచే కదా అందుకే ఆయన విగ్రహాన్ని మట్టితోనే చేయాలని, మట్టి వినాయకులనే పూజించాలని సూచించారు. మట్టి వినాయకుని పూజించడం అంటే మన ప్రకృతిని పూజించడంతో సమానమని మనకు జీవాన్ని, జీవితాన్ని మనుగడని ఇస్తున్న ప్రకృతిని పూజించే అవకాశం మనకు వినాయక చవితి ద్వారా లభిస్తుందని అలాంటి మంచి అవకాశాన్ని వినియోగించుకొని మట్టి వినాయకుడిని పూజించాలని కోరారు. వినాయక చవితి పండగ అంటేనే ప్రకృతితో ముడిపడి ఉంటుందని అన్నారు. వినాయక చవితి పండుగను ప్రతీ ఒక్కరూ భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని సూచించారు.